Brahmastra : బ్రహ్మాస్త్ర ఫస్ట్ సాంగ్ గ్లింప్స్‌

భారతీయ సినిమా అంటే బాలీవుడ్. బాలీవుడ్ అంటే భారతీయ సినిమా. ఇది ఒక్కప్పటి మాట. ప్రస్తుతం బాలీవుడ్ ప్లాప్ సినిమాలతో నిండా మునిగిపోయింది. ఒక్క “ది కశ్మీర్ ఫైల్స్” మినహా బీ టౌన్ లో పెద్దగా ఆడిన సినిమాలు లేవు. భారీ అంచనాలతో రిలీజైన “రన్ వే 34” “హీరో పంటి-2” “జెర్సీ” సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబొర్ల పడ్డాయి.

ప్రస్తుతం బాలీవుడ్ మొత్తం న్యూ కపుల్ రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించిన “బ్రహ్మాస్త్ర” పైనే అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా కోసం బీ టౌన్ ప్రేక్షకులు కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సోషియో ఫాంటసీ మూవీ 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది. కాగ ఈ మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ 9న రిలీజ్ కానుంది.

తాజా గా ఈ మూవీ తెలుగు ఆడియో ఫస్ట్ గ్లింప్స్ ను టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్. ఎస్ రాజమౌళి రిలీజ్ చేశారు. మూవీలో హీరోయిన్ అందాన్ని వివరిస్తూ, “కుంకుమలా..” అంటూ సాగుతున్న ఈ పాట ఆకట్టుకుంటుంది. ఈ పాటను సిద్ శ్రీ రామ్ పాడగా, ప్రీతమ్ మ్యూజిక్ అందించాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు