Major : “మేజర్” ప్లాన్..!

సినిమా అంచనాలు భారీగా ఉండి, ప్రేక్షకుల కాస్త ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే టికెట్స్ ధరలను పెంచి క్యాష్ చేసుకుంటారు నిర్మాతలు. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు సినీ నిర్మాతలు లేఖల రాసి మరీ టికెట్ల ధరలను పెంచుకున్నారు. ఇటీవల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన దాదాపు అన్ని సినిమాలకు ఇదే జరిగింది. ఇతర భాషాల్లో తెరకెక్కి, తెలుగులో డబ్ అయిన “కేజీఎఫ్-2” “బీస్ట్” వంటి సినిమాలకు కూడా టికెట్ ధరలను పెంచారు.

అయితే టికెట్ల ధరలు భారీగా పెరగడంతో కలెక్షన్లు పెరిగినా, సామాన్యులు థియేటర్స్ రావడం మానేశారు. దీంతో కలెక్షన్లు భారీగా రావడం కొద్ది రోజులకే పరిమితం అయింది. ఈ సమయంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన “ఎఫ్ 3” మూవీ నిర్మాత దిల్ రాజు కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ సినిమాకు టికెట్ల ధరలను పెంచబోమని ప్రకటించారు. సామాన్య ప్రేక్షకులు కూడా తమ సినిమాను ఆనందంగా చూడొచ్చు అని తెలిపారు.

“ఎఫ్ 3″కి ధరలను పెంచకపోయినా, టికెట్ల సామాన్యలు అందుకోలేనంతగానే ఉన్నాయని మూవీ యూనిట్ పై ట్రోల్స్ కూడా వచ్చాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం సినిమా టికెట్ల ధరలను పెంచకపోవడం కాదు, ఏకంగా తగ్గిస్తున్నామంటూ “మేజర్” మూవీ యూనిట్ అనౌన్స్ చేసింది. సినిమా అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ధరలను తగ్గించామని చెబుతుంది.

- Advertisement -

కరోనా మహమ్మారి తర్వాత ఒక సినిమాకు అత్యంత తక్కువ ధరలు ఉండటం ఇదే తొలిసారి అంటూ ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. కాగ మూవీ యూనిట్ ధరలు తగ్గించడం వల్ల ఈ మూవీ టికెట్లు తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో 150 రూపాయలు ఉండగా, మల్టీ ప్లేక్స్ లో 195 రూపాయలు ఉంది. అలాగే అంధ్ర ప్రదేశ్ లో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో 147 రూపాయలు ఉండగా, మల్టీ ప్లేక్స్ లో 177 రూపాయలు ఉంది.

ధరలను తగ్గించి, సామాన్య ప్రేక్షకులను థియేటర్స్ రప్పించి, కలెక్షన్లు పెంచుకోవాలనే “మేజర్” ప్లాన్ బాగుందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు