F3 : ఆ మూడు కలిపితే ‘ఎఫ్3’?

వెంకటేష్, వరుణ్ తేజ్ లు హీరోలుగా తెరకెక్కిన ‘ఎఫ్3’ చిత్రం ఈరోజు విడుదలైంది. ‘ఎఫ్2’ కి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీ ముందు నుండీ భారీ హైప్ ను సొంతం చేసుకుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. ఈరోజు విడుదలైన ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తుంది.

ఈ మూవీతో అనిల్ రావిపూడి డబుల్ హ్యాట్రిక్ కొట్టేసాడనే కామెంట్స్ కూడా ఎక్కువయ్యాయి. ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ రావడానికి కారణం అనిల్ రావిపూడి కన్విన్సింగ్ స్క్రీన్ ప్లే. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో వచ్చిన పెద్ద సినిమాలు అన్నీ కూడా సీరియస్ ప్లాట్లో సాగినవే. అందుకే ‘ఎఫ్3’ సినిమా వాళ్ళకందరికీ నచ్చేస్తుంది.

అయితే ఈ చిత్రం కథలో ఏమాత్రం కొత్తదనం ఉండదు. అలాగే లాజిక్ లు కూడా ఉండవు అనేది సినిమా చూసిన ప్రతీ ఒక్కరి మనసులో నుండీ బయటకి రాలేని సమాధానాలు. నిజానికి ఈ చిత్రం కథ.. చిరంజీవి నటించిన ‘చంటబ్బాయి’, బాలకృష్ణ- ఏఎన్నార్ కాంబినేషన్లో వచ్చిన ‘గాండీవం’, రాజేంద్ర ప్రసాద్ నటించిన ‘ఆ ఒక్కటీ అడక్కు’ వంటి చిత్రాల రిఫరెన్స్ తో తయారయ్యిందే.

- Advertisement -

కొన్ని సీన్లు చూస్తే అల్లరి నరేష్- కృష్ణ భగవాన్ లు నటించిన ‘బొమ్మన బ్రదర్స్ చందన’ సిస్టర్స్ కూడా గుర్తుకొస్తుంది. వెంకటేష్ రోల్ లో కృష్ణ భగవాన్, అల్లరి నరేష్ పాత్రలో వరుణ్ తేజ్ గుర్తుకొస్తారు.అయినప్పటికీ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇలాంటి రొటీన్ కామెడీ ట్రాక్ లతో అనిల్ రావిపూడి ఇంకా ఎంతకాలం నెట్టుకొస్తాడు అనేది అంతు చిక్కని ప్రశ్న.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు