Samantha : సమంత అలా ఒంటరిగా చనిపోవాలట

నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న దగ్గర నుండీ సమంత పై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో సమంత పై విపరీతమైన నెగిటివ్ కామెంట్స్ ఎక్కువయ్యాయి.ఇంత వ్యతిరేకతని ఆమె ఎలా తట్టుకుంటుందా అనే అనుమానం ఎవ్వరికైనా వస్తుంది. తాజాగా మరో నెటిజెన్ సమంత పై ఇష్టమొచ్చిన కామెంట్లు చేశాడు.

మేటర్లోకి వెళితే.. సమంత షూటింగ్ మధ్యలో గ్యాప్ వస్తే జిమ్లో లేదా తన పెట్స్ తో సమయం గడుపుతుందన్న సంగతి తెలిసిందే.తన పెట్స్ ను పిల్లలుగా చూసుకుంటున్నట్లు సమంత పలు సార్లు చెప్పుకొచ్చింది.సమంత తన పెట్స్ కు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇప్పుడు కూడా కొన్ని ఫోటోలను అలాగే షేర్ చేసింది.

దీంతో ఓ నెటిజెన్ ‘సమంత తన పెట్స్‌, పిల్లులతో ఒంటరిగా చనిపోవాలి అని కోరుకుంటున్నాను’ అంటూ ఘోరమైన కామెంట్ చేశాడు. ఇందుకు సామ్ ‘అలాగే జరిగితే నన్ను నేను అదృష్టవంతురాలిగా భావిస్తాను’ అంటూ సమాధానమిచ్చింది. నెటిజెన్ అలాంటి కామెంట్ చేశాక కూడా ఇలా కూల్ గా సమాధానం ఇవ్వడంతో అందరూ సామ్ ఓపికను మెచ్చుకుంటున్నారు. ఇక ఆమె నటించిన ‘శాకుంతలం’ ‘యశోద’ సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇక విజయ్ దేవరకొండ తో చేస్తున్న ‘ఖుషి’ చిత్రీకరణ దశలో ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు