Varalakshmi SarathKumar: డేట్స్ దొరకడమే కష్టమైపోయిందా?

కోలీవుడ్ సీనియర్ స్టార్ హీరో శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మీ తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమే. హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టిన వరలక్ష్మి తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది. తమిళంలో పందెం కోడి 2, సర్కార్ , మారి 2 వంటి పలు హిట్ సినిమాల్లో నటించింది. గతేడాది క్రాక్ చిత్రంతో దర్శకుడు గోపీచంద్ మలినేని వరలక్ష్మిని టాలీవుడ్ కు తీసుకొచ్చాడు.ఆ సినిమాలో వరలక్ష్మి చేసిన జయమ్మ పాత్రకి మంచి పేరు వచ్చింది.

ఆ వెంటనే అల్లరి నరేష్ నాంది సినిమాలో నటించింది. అందులో హీరో అల్లరి నరేష్ కంటే కూడా వరలక్ష్మి పోషించిన ఆద్య  పాత్రకే మంచి మార్కులు పడ్డాయి. సినిమాకి హైలెట్ గా నిలిచింది ఆద్య పాత్ర.
క్రాక్ , నాంది సినిమాలు హిట్ అవ్వడంతో బాలయ్య 107, పక్కా కమర్షియల్, యశోద వంటి చిత్రాల్లో ఎంపికైంది.

తెలుగులో వరలక్ష్మికి వరుస ఆఫర్ లు లభిస్తున్నాయి. ఇప్పటికే చాలా పెద్ద సినిమాలకు కమిట్ అయ్యింది. ఇటీవల వరలక్ష్మిని వెతుక్కుంటూ ఓ పెద్ద దర్శకుడు వెళ్తే డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోతున్నట్టు చెప్పి ఆ ఆఫర్ ను తిరస్కరించిందట. పాత్ర నచ్చక అలా చెప్పిందేమో అని దర్శకుడు అనుకున్నాడట. కానీ నిజంగానే వరలక్ష్మికి కాల్ షీట్లు ఖాళీ లేవు అని తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు