Pakka Commercial: జేక్స్ బిజొయ్ కి బదులు తమన్

రీసెంట్ గా విడుదలైన పక్కా కమర్షియల్ చిత్రం టాక్ తో సంబంధం లేకుండా తొలి రోజు మంచి వసూళ్ళను రాబట్టింది. సినిమాలో ఉన్న ఎంటర్టైన్మెంట్, యాక్షన్ ఎపిసోడ్స్ , రావు రమేశ్ విలనిజం, అజయ్ ఘోష్ కామెడీ ఇలా చెప్పుకుంటే సినిమాని బాక్సాఫీస్ వద్ద నిలబెట్టే హైలెట్స్ ఈ మూవీలో ఉన్నాయి. ఓ కమర్షియల్ సినిమాకి ఉండాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఈ మూవీలో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాడు మారుతి. కాకపోతే ఒక్క మ్యూజిక్ విషయంలోనే అతను మిస్టేక్ చేసినట్టు అనిపిస్తుంది. మొదటి రోజు ఆడియెన్స్ రెస్పాన్స్ ను బట్టి ఈ మూవీకి మ్యూజిక్ అనేది మైనస్ అయ్యిందేమో అనిపిస్తుంది.

ఈ చిత్రంలో పాటలు చూడడానికి బాగున్నాయి.చాలా రిచ్ గా కూడా ఉన్నాయి. వినడానికి కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే అవి అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే పాటలు కావు. పాటలకి నిర్మాతలు మంచి మంచి సెట్టింగ్ లు వేశారు అంటే బాగానే ఖర్చు పెట్టారు అనుకోవాలి. అయితే జేక్స్ బిజొయ్ కి బదులు తమన్ ను తీసుకుని ఉంటే బాగుండేది అని కొందరి అభిప్రాయం. జేక్స్ కూడా అల్లాటప్పా మ్యూజిక్ డైరెక్టర్ ఏమీ కాదు.అతను మలయాళంలో అయ్యప్పనుమ్ కోషీయమ్ వంటి హిట్ చిత్రాలకి పనిచేశాడు. తెలుగులో కూడా టాక్సీ వాలా చిత్రానికి అద్భుతమైన మ్యూజిక్ ను అందించాడు. యంగ్ హీరోలకు అయితే ఓకె. కానీ గోపీచంద్ మాస్ ఆడియన్స్ కు దగ్గరగా ఉండే హీరో. అలాంటి హీరో సినిమాకి తమన్ లాంటి వాళ్ళే మ్యూజిక్ అందిస్తే బాగుంటుంది అని అందరూ అభిప్రాయపడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు