Upendra: భోజనం కోసం వెళ్తే.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన ఉపేంద్ర..!

ప్రముఖ నటులు, దర్శకుడు అయిన ఉపేంద్ర కన్నడ సినీ ఇండస్ట్రీకి చెందిన వారైనప్పటికీ తెలుగు ప్రేక్షకులను తన నటనతో బాగానే ఆకట్టుకున్నారు. ఒకప్పుడు డైరెక్టర్గా కూడా మంచి పేరు దక్కించుకున్న ఈయన ఇప్పుడు పలు సీనియర్ హీరోల చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.. ముఖ్యంగా చెప్పాలంటే ఉపేంద్ర డైరెక్షన్ కి స్టార్ డైరెక్టర్లు కూడా ఫిదా అవుతారు.. అలా సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా ఉపేంద్రకు పెద్ద అభిమాని.. ఆయన డైరెక్షన్ అంటే చాలా ఇష్టమని.. ఎన్నో సందర్భాలలో చెప్పుకొచ్చారు కూడా.. ఇక భారతీయ చలనచిత్ర పరిశ్రమలో భిన్నంగా ఆలోచించే దర్శకుడిగా పేరు దక్కించుకున్నారు.. నటుడిగా, దర్శకుడిగా స్టార్ పొజిషన్ కి చేరుకున్న ఉపేంద్ర ఒకప్పుడు ఈయన సినీ ప్రయాణం మాత్రం ముళ్ళ బాట అని చెప్పాలి..

భోజనం కోసం వెళ్తే అవమానించారు..
ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన ఉపేంద్రకు మొదట్లో ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి.. గతంలో ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉపేంద్ర తొలినాళ్లల్లో తనకు ఎదురైన అవమానాలను గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యారు.. ప్లేట్ పట్టుకొని భోజనం కోసం నిలబడితే ప్రొడక్షన్ వారు అవమానించారు అంటూ తెలిపారు.. ఆయన మాట్లాడుతూ.. మొదట నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను.. ఒకసారి షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకున్న తర్వాత భోజనం కోసం ప్లేట్ తో లైన్ లో నిలుచున్నాను. అప్పుడు భోజనం వడ్డిస్తున్న ప్రొడక్షన్ కి చెందిన ఒక వ్యక్తి భోజనం పెట్టను.. పక్కకు వెళ్ళిపో అన్నాడు.. ఇలాంటి రోజులు, అవమానాలు ఎన్నో ఎదురయ్యాయి అంటూ ఎమోషనల్ అయ్యారు ఉపేంద్ర..

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు..
అయితే కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు.. నన్ను అవమానించిన ఆ వ్యక్తి నేను హీరోగా నటించడం ప్రారంభించిన తర్వాత నా సెట్ కి వచ్చి నాకు భోజనం వడ్డించాడు.. నేను అప్పుడు, ఇప్పుడు అంతే గౌరవంగా మాట్లాడాను.. అందుకు కారణం కూడా ఉంది.. అతడు నన్ను అవమానించినప్పుడు నాకు ఎలాంటి గుర్తింపు లేదు.. నేను హీరోగా మారిన తర్వాత గతాన్ని గుర్తు పెట్టుకొని ఆయనపై ద్వేషం పెంచుకోవడం సరికాదు.. ఒక వ్యక్తి జీవితంలో అనుభవించే చేదు అతన్ని మంచిగా మార్చాలి ..తప్ప చెడుగా మార్చకూడదని ఒక జర్నలిస్టు నాతో చెప్పాడు.. ఇక దానినే నేను అనుసరిస్తున్నాను అంటూ ఉపేంద్ర తెలిపారు .

- Advertisement -

ఉపేంద్ర కెరియర్..
కాలేజీలో ఉన్నప్పుడు కవితలు రాసే వాడిని.. దీంతో నా దగ్గరి బంధువు ఒకరు కాశీనాథ్ వద్దకు తీసుకువచ్చారు.. అక్కడ కూడా నా ప్రతిభతో కాశీనాథ్ మొదటి శిష్యుడుగా తర్లే నాన్ మగా సినిమాతో దర్శకుడిగా మారాను అంటూ తెలిపారు.. కన్నడలో ఎన్నో సినిమాలు తెరకేక్కించాను.. ఇక నేను దర్శకత్వం వహించిన చాలా సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యాయి. చాలా కాలం తర్వాత దర్శకుడిగా యుఐ అనే సినిమాతో త్వరలోనే మీ ముందుకు రాబోతున్నాను అంటూ తెలిపారు. ఇకపోతే ఒకానొక సమయంలో ఉపేంద్ర పడిన కష్టాలు తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు