జెర్సీ కాపీ రైట్ కేసులో ఊహించ‌ని ట్విస్ట్

నేచురుల్ స్టార్ నాని న‌టించిన స్పోర్ట్స్ డ్రామ జెర్సీ తెలుగులో మంచి హిట్ అందుకున్న విష‌యం తెలిసిందే. దీంతో ఈ సినిమాను బాలీవుడ్ లో అదే టైటిల్ తో తెర‌కెక్కించారు. షాహిద్ క‌పూర్ కీ రోల్ లో వ‌స్తున్న ఈ సినిమాను గౌతమ్ తిన్న‌నూర్ డైరెక్ట్ చేస్తున్నాడు. అల్లు అర‌వింద్, దిల్ రాజ్ నిర్మిస్తున్నారు. అయితే జెర్సీ షూటింగ్ స్టార్ట్ అయిన నుంచి అన్ని ఎదురు దెబ్బ‌లే త‌గులుతున్నాయి. గ‌త ఏడాది అగ‌స్టులోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల వాయిదా ప‌డుతూ వ‌స్తుంది.

ఇటీవ‌ల షూటింగ్ పూర్తి చేసుకున్న జెర్సీ.. ఏప్రిల్ 22న విడుద‌ల కాబోతుంది. అయితే ఈ సినిమా రీలిజ్ కు ముందు మ‌రో షాక్ త‌గిలింది. జెర్సీ క‌థ త‌న‌ది అంటూ.. బాలీవుడ్ ర‌చ‌యిత ర‌జ‌నీష్ జైస్వాల్ ముంబై హై కోర్టును ఆశ్ర‌యించాడు. దీంతో ముంబై హై కోర్టు.. జెర్సీ మూవీ యూనిట్ కు ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చింది. టైటిల్స్ లో ర‌చ‌యిత ర‌జ‌నీష్ కు క్రెడిట్ ఇవ్వాల‌ని తీర్పు ను ఇచ్చింది. పిటిష‌న్ దారుపై అనేక ప్ర‌శ్న‌లు వేసిన త‌ర్వాత ముంబై హై కోర్టు ఈ తీర్పును ఇచ్చింది.

ఇదే కథ‌తో తెలుగులో జెర్సీ రిలీజ్ అయిన‌ప్పుడు కోర్టుకు ఎందుకు రాలేద‌ని ర‌చ‌యిత‌ను కోర్టు ప్ర‌శ్నించింది. అయితే త‌న‌కు తెలుగు రాద‌ని.. స్టోరీ అర్థం కాలేద‌ని తెలిపాడు. ఇప్పుడు హిందీ లాగ్వేంజ్ కావ‌డంతో త‌న స్టోరీ అని తెలిసింద‌ని కోర్టుకు వివ‌రించాడు. తాను 2007 లోనే ఈ క‌థ‌ను ఫిల్మ్ ఛాంబ‌ర్ లో న‌మోదు చేసుకున్న‌ట్టు తెలిపాడు. ఏది ఎమైనా.. జెర్సీ సినిమా రిలీజ్ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు అనేక చిక్కుల్ల‌ను ఎదుర్కొంటూ.. వ‌స్తుంది. అడ్వాన్స్ బుకింగ్స్, థియేట‌ర్స్ బుకింగ్స్ లోనూ కేజీఎఫ్-2 ప్ర‌భావంతో ఇబ్బందులు ప‌డుతున్న ఈ సినిమా.. ఆడియ‌న్స్ ను ఎంత వ‌ర‌కు ఆక‌ట్టుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు