హీరోలు అంటే.. స్టైలీష్ గా ఉండి.. హీరోయిన్స్ తో డాన్స్, రోమాన్స్ చేయడం, విల్లన్స్ తో ఫైట్ చేసి హీరోయిజం చూపిస్తారు. స్టోరీలో హీరోను డామినేట్ చేసే రోల్స్ ఉంటే.. ఒప్పుకోరు. సినిమా అంతా.. తామే ఉండాలని హీరోలు రూల్స్ పెడుతారు. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది. హీరోలు తమ టెస్ట్ ప్రకారం కాకుండా.. ఆడియన్స్ టెస్ట్ మేరకు పాత్రలు చేస్తున్నారు. స్టార్ హీరోలు.. స్టోరీ నచ్చితే.. విలన్ రోల్స్ చేయడానికి కూడా వెనకాడటం లేదు. టాలీవుడ్, బాలీవుడ్ ఇలా.. ఇండస్ట్రీ ఏదైనా.. హీరోల ఆలోచన ఇప్పుడు ఇదే.
ఇటీవల రిలీజ్ అయిన కేజీఎఫ్ చాప్టర్ 2 లో విలన్ రోల్ లో బాలీవుడ్ అగ్ర హీరో సంజయ్ దత్ కనిపించిన విషయం తెలిసిందే. ఆధీర పాత్రలో తన మార్క్ నటన అందించాడు. సంజయ్ దత్ గతంలోనూ కొన్ని సినిమాల్లో ప్రతి నాయకుడిగా కనిపించి ఆడియన్స్ ఆకట్టుకున్నాడు. హృతిక్ రోషన్ అగ్నిపథ్ సినిమాలో కంచ చీనా విలన్ గా కనిపించి భయపెట్టాడు. ఈ రోల్ తో బాలీవుడ్ లో ఒక ట్రెండ్ సెట్ చేశాడు. హీరో గానే కాదు.. విలన్ పాత్రతోనూ క్రేజ్ ను పెంచుకోవచ్చని సంజయ్ దత్ నిరూపించాడు.
తెలుగు లో జగపతి బాబు.. బాలకృష్ణ లెజెండ్ సినిమాతో విలన్ గా పరిచయం అయ్యాడు. అప్పటి వరకు హీరోగా ప్లాపు ఎదుర్కొంటున్న జగపతి బాబుకు ఒక్క సారిగా క్రేజ్ పెరిగింది. దీంతో విలన్ గానే సెటిల్ అయ్యాడు. అలాగే హీరో శ్రీకాంత్ కూడా అఖండ సినిమాతో విలన్ అవతారం ఎత్తాడు. ఈ సినిమాలో మంచి మార్కులు పడటంతో పునిత్ రాజ్ కుమార్ జెమ్స్ సినిమాలోనూ నెగిటివ్ రోల్ లో నటించాడు. మరి కొన్ని సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు. ధృవ లో అరవింద్ స్వామి, అజ్ఞాత వాసిలో ఆది పినిశెట్టి, నేచురల్ స్టార్ నాని, కార్తికేయ ఇలా చెప్పుకుంటూ పోతే.. చాలా మంది హీరోలు నెగెటివ్ రోల్స్ లో కనిపించి ఆడియన్స్ ను తమ వైపునకు తిప్పుకున్నారు.
ప్రస్తుతం ఇండస్ట్రీకి యంగ్ హీరోలు ఎక్కువగా రావడంతో ఆడియన్స్ వారి సినిమాలకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాగే ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు హీరో పాత్రలతో పాటు విలన్స్ పాత్రలకు కూడా కనెక్ట్ అవుతున్నారు. డైరెక్టర్స్ కూడా హీరో – విలన్ రోల్స్ ను బ్యాలెన్స్ గా మెయిటెన్ చేస్తున్నారు. వీటి వల్ల కథనాయకుడు తో పాటు ప్రతి నాయకుడి పాత్రలకు డిమాండ్ పెరిగింది.