కొత్త పెళ్లి కూతురు ఆలియా గంగూభాయి క‌తియావాడి ఓటీటీ డేట్ ఫిక్స్

ఇటీవ‌లే ప్రియుడు ర‌ణ‌బీర్ క‌పూర్ తో పెళ్లి పీట‌లెక్కిన ఆలియా భ‌ట్.. కొత్త జీవితాన్ని ఆస్వాదిస్తోంది. ఐదేళ్లు షికార్లు చేసిన ఈ ల‌వ్ బ‌ర్డ్స్ ఒక్క‌టైయ్యారు. గంగూభాయి క‌తియావాడి, ఆర్ఆర్ఆర్ సినిమాలు సూప‌ర్ హిట్ కావ‌డం, ప్రియుడితో పెళ్లితో ఆలియా భ‌ట్ ఫుల్ హ్యాపీ మూడ్ లో ఉంది. కాగ ఈ కొత్త పెళ్లి కూతురు లీడ్ రోల్ లో న‌టించిన గంగూభాయి క‌తియావాడి సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించి.. ఓటీటీ రిలీజ్ కు సిద్ధం అవుతుంది. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా ఏప్రిల్ 26 నుంచి ప్రసారం కానుంది.

గంగూభాయి క‌తియావాడి బ‌యో గ్రాఫిక‌ల్ క్రైమ్ డ్రామా గా సంజ‌య్ లీలా బ‌న్స‌లీ డైరెక్ట్ చేశాడు. హుస్సేన్ జైద్ రాసిన మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై అనే పుస్త‌కం ఆధారం గా ఈ సినిమాను తెర‌కెక్కించారు. అలాగే ఈ సినిమాకు సాంగ్స్ తో పాటు ప్రొడ్యూస‌ర్ కూడా బ‌న్స‌లీయే. ఫిబ్ర‌వ‌రి 25న రిలీజ్ అయిన ఈ సినిమా.. విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు అందుకుంది. రూ. 186 కోట్ల క‌లెక్ష‌న్స్ కూడా చేసింది. ఇదిలా ఉండ‌గా.. ఆలియా భ‌ట్ న‌టించిన ఆర్ఆర్ఆర్ సినిమా కూడా ఓటీటీ రిలీజ్ సిద్ధం అయింద‌ని తెలుస్తుంది. ఒక ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ‌క భారీ ధ‌ర‌కు ద‌క్కించుకుంద‌ట‌. జూన్ మొద‌టి వారంలో ప్ర‌సారం చేయ‌నున్నార‌ని విశ్వ‌స‌నీయ వర్గాల స‌మాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు