తమన్నా హాట్ లుక్స్, మెహ్రీన్ గ్లామర్ షో యూట్యూబ్ షేక్ అవుతుంది. పొట్టి డ్రెస్సులు వేసుకుని.. ఊ.. ఆ..అహా.. ఆహా.. అంటూ ఫ్యాన్స్ కు మెంటలెక్కిస్తున్నారు. అసలేం జరగిందంటే.. వెంకటేష్ – తమన్నా, వరుణ్ తేజ్ – మెహ్రీన్ లీడ్ రోల్స్ లో ఎఫ్3 మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి ఊ.. ఆ. ఆహా.. ఆహా అనే సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ పాటలో వెంకటేష్ – తమన్నా, వరుణ్ తేజ్ – మెహ్రీన్ డాన్స్ ఆకట్టుకుంటుంది.
అలాగే పార్టీ సాంగ్ లో హీరోయిన్స్ చీరకట్టులో గ్లామర్ గా కనిపించారు. ఈ ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్ లో హల్చల్ చేస్తుంది. ఊ.. ఆ.. ఆహా.. ఆహా.. అనే ఫుల్ సాంగ్ ను ఏప్రిల్ 22న రిలీజ్ చేయనున్నారు. ప్రోమోతోనే ఆడియన్స్ ను ఆకట్టుకున్న ఈ సాంగ్.. ఏప్రిల్ 22న యూట్యూబ్ దుమ్ములేపడం ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు.
కాగ వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీ స్టారర్ గా వస్తున్న ఎఫ్3 మూవీని అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇది 2019లో వచ్చిన ఎఫ్2 కు సీక్వెల్ గా తెరకెక్కుతుంది. దిల్ రాజ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. రాజేంద్ర ప్రసాద్, సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. కరోనా మహమ్మారి వల్ల వాయిదా పడుతూ వస్తున్న ఎఫ్3ని మే 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.
Here's a sizzling promo of the peppy song #WooAaaAhaAha🕺
— DEVI SRI PRASAD (@ThisIsDSP) April 20, 2022
▶️ https://t.co/B9Ltr6tmwJ
Full Lyrical song on April 22nd🥁
A @ThisIsDSP Musical🎶#F3Movie #F3OnMay27@VenkyMama @IAmVarunTej @AnilRavipudi @tamannaahspeaks @Mehreenpirzada @sonalchauhan7 @SVC_official @adityamusic