ప‌వ‌ర్ స్టార్ బ్లాక్ బస్ట‌ర్ మూవీ టైటిల్ తో విజ‌య్..!

పూరీ జ‌గ‌న్నాథ్ తో లైగ‌ర్ మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. వ‌రుస సినిమాల‌ను లైన్ లో పెడుతున్నాడు. మ‌రోసారి పూరీ జ‌గ‌న్నాథ్ తో జ‌న‌గ‌న‌మ‌ణ సినిమా చేస్తున్న‌ట్టు అఫీషియ‌ల్ అనౌన్స్ కూడా వచ్చింది. ఇదిలా ఉండ‌గా.. ఈ రౌడీ హీరో మ‌రో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. మ‌జిలీ మూవీతో డిసెంట్ హిట్ కొట్టిన శివ నిర్వాణ డైరెక్ష‌న్ లో ఈ సినిమా వ‌స్తున్న‌ట్టు తెలుస్తుంది. టాలీవుడ్ క్వీన్ స‌మంత‌ ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేశార‌ట‌. అతి త్వ‌ర‌లోనే దీని నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న రానుంద‌ట‌. ఈ మూవీలో విజ‌య్ దేవ‌ర‌కొండ అర్మీ ఆఫీస‌ర్ గా,స‌మంత‌.. క‌శ్మీర్ ప్రాంతానికి చెందిన అమ్మాయి పాత్ర‌ల‌లో క‌నిపించ‌బోతున్నార‌ని టాలీవుడ్ టాక్.

అలాగే ఈ సినిమా గురించి మ‌రో వార్త సోషల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతుంది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ఖూషీ టైటిల్ ను ఫిక్స్ చేశార‌ట‌. ఖూషీ మూవీ ప‌వ‌ర్ స్టార్ కెరీర్ లో చేర‌గ‌ని ముద్ర వేసింది. ఆ రోజుల్లోనే బాక్సాఫీస్ వ‌ద్ద రూ. 27 కోట్ల క‌లెక్ష‌న్లు చేసింది. అలాంటి సినిమా టైటిల్ పై విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌యోగం చేయ‌డం కొంత వ‌ర‌కు ధైర్యం అనే చెప్పాలి. గ‌తంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ తొలిప్రేమ మూవీ టైటిల్ తో మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ కూడా సినిమా చేశాడు. ఈ సినిమా మంచి హిట్ అందుకుని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ ను హ‌ర్ట్ చేస్తాడో.. ఖూషీ చేస్తాడో చూడాలి మ‌రి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు