హ‌రి హ‌ర వీర‌మ‌ల్లులో ప‌వ‌ర్ స్టార్ మూడు పాత్ర‌లు..!

రాజ‌కీయాల‌కు వెళ్లాక‌.. సినిమాల‌కు గ్యాప్ ఇచ్చిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌కీల్ సాబ్ తో సూప‌ర్ విక్ట‌రీని అందుకున్న విష‌యం తెలిసిందే. దీని త‌ర్వాత భీమ్లా నాయ‌క్ తో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాల త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పీడ్ పెంచాడు. క్రిష్ జాగ‌ర్ల‌మూడి డైరెక్ష‌న్ లో హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు, హ‌రీష్ శంక‌ర్ తో భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్ తో పాటు సురేంద‌ర్ రెడ్డి తోనూ సినిమా చేస్తున్నాడు. కాగ‌ హ‌రి హ‌ర వీరమ‌ల్లు మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది. ఇప్ప‌టికే 50 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంద‌ని ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాల టాక్. తాజాగా మ‌రో షెడ్యూల్ కూడా ప్రారంభం అయింది. దీనిలో ప‌వ‌న్ పై యాక్ష‌న్ సీన్స్ ను చిత్రీక‌రిస్తున్నార‌ట‌. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో ఫుల్ వైర‌ల్ అయ్యాయి.

కాగ హ‌రి హ‌ర వీరమ‌ల్లు సినిమా నుంచి ఒక క్రేజీ అప్‌డేట్ అంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ సినిమాలో ప‌వ‌ర్ స్టార్ మూడు విభిన్న పాత్ర‌ల‌లో క‌నిపించబోతున్నార‌ట‌. ఈ మూడు పాత్ర‌ల కోసం ప‌వ‌న్ కు 30 ర‌కాల డ్రెస్ ల‌ను చిత్ర బృందం సిద్ధం చేసిందట‌. అందు కోసం నిర్మాత‌లు ప్ర‌త్యేకంగా బ‌డ్జెట్ ను కూడా కేటాయించార‌ట‌. అయితే ఈ మూడు పాత్ర‌ల్లో హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు రోల్ హైలైట్ గా ఉంటుద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ప‌వ‌న్ పాత్ర‌.. రాబిన్ హుడ్ ను పోలి ఉంటుంద‌ట‌.

డ‌బుల్ రోల్స్ లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్ప‌టి వ‌ర‌కు తీన్ మార్ అనే సినిమాలో మాత్ర‌మే చేశాడు. ఇప్పుడు ఏకంగా మూడు పాత్ర‌లు చేయ‌నున్నాడ‌నే వార్త‌లు రావ‌డంతో ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ గ‌బ్బ‌ర్ సింగ్ చేసే ఈ ప్ర‌యోగం ఎంత వ‌ర‌కు వ‌ర్కౌట్ అవుతుందో చూడాలి మ‌రి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు