Guntur Kaaram: మహేష్‌తో సినిమా చేస్తున్నారా.? ముఖేష్ యాడ్ చేస్తున్నారా.?

సంక్రాంతికి రిలీజ్ కాబోయే సినిమాల్లో మోస్ట్ అవైటెడ్ మూవీ అంటే గుంటూరు కారం అని చెప్పాలి. త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇదివరకే వీరి కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయాయి. కానీ ఈ సినిమాలకి ఇప్పటికీ టీవీలో వచ్చిన ఆదరణ మరో సినిమాలకి రాదు అని చెప్పొచ్చు.

Read More:Guntur Kaaram Update: ఇది బాబు గారి రీవెంజ్… అందుకే గుంటూరు కారం లేట్?

టీవీ రిమోట్ తో పని లేకుండా చూడొచ్చు ఈ సినిమాలు టీవీలో వచ్చినప్పుడు. ఇప్పటికీ ఈ సినిమాలను రీ రిలీజ్ చేస్తే ఆడియన్స్ ఎగబడి చూస్తారు. దీనిలో సందేహమే లేదు. కానీ అప్పట్లో ఈ సినిమాలు అంతగా ఎక్కలేదు. ఖలేజా విషయానికొస్తే, మహేష్ లోని పరిపూర్ణమైన నటుడిని బయటికి తీసిన సినిమా ఖలేజా. ఖలేజా సినిమాలో వేరియేషన్స్ వల్లనే దూకుడులో మహేష్ నుండి అంత కామెడీ టైమింగ్ ను బయటకు తీశాడు శ్రీనువైట్ల.

- Advertisement -

ఆ రెండు సినిమాలు కమర్షియల్ గా హిట్ కాకపోవటం వలన, ఇప్పుడు ఆడియన్స్ మైండ్ సెట్ మారడం వలన ఒక మాస్ కమర్షియల్ సబ్జెక్ట్ ని డీల్ చేసే పనిలో పడ్డాడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. గుంటూరు కారం సినిమాతో ఎలా అయినా సరే మంచి హిట్ అందుకోవాలని ఇద్దరూ మంచి కసి తో పని చేస్తున్నారు. ఈ సినిమా నుంచి మొదటి పోస్టర్ రిలీజ్ అయినప్పటి నుంచి మంచి అంచనాలు ఈ సినిమాపై ఏర్పడ్డాయి.

Read More:Guntur Kaaram: మహేష్ ఫారిన్ ట్రిప్స్ పై ప్రొడ్యూసర్ కామెంట్స్..!

అయితే ఇప్పటివరకు ఈ సినిమా అప్డేట్ కు సంబంధించి ఒక్కొక్క పోస్టర్ రిలీజ్ చేస్తూ వచ్చారు. ప్రతి పోస్టర్ మహేష్ మహేష్ స్మోకింగ్ స్టిల్ ను రిలీజ్ చేసారు. ఇప్పటివరకు వితౌట్ స్మోకింగ్ పిక్ ఒకటి కూడా బయటకు రిలీజ్ చేయలేదు. దీనితో కొంతమందికి ట్రోల్ కూడా చేయటం మొదలుపెట్టారు. అసలు మహేష్ తో త్రివిక్రమ్ సినిమా చేస్తున్నాడా, లేదంటే ముఖేష్ యాడ్ చేస్తున్నాడా అనే రేంజ్ లో కూడా ట్రోలింగ్స్ ఏర్పడ్డాయి.

ఇకపోతే మహేష్ స్మోకింగ్ మానేసి చాలా సంవత్సరాలు అవుతుంది. ఈ సినిమాలో క్యారెక్టర్ ఎంత డిమాండ్ చేస్తే మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత మహేష్ స్మోకింగ్ సీన్ కి ఒప్పుకున్నాడని సినిమా చూస్తే తెలుస్తుంది. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ను త్రివిక్రమ్ శ్రీనివాస్ బర్త్ డే సందర్భంగా ఏడవ తారీఖున రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా జనవరి 12 సంక్రాంతికి విడుదల కానుంది.
Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు