Trisha Krishnan marriage : త్రిష రహస్యంగా పెళ్లి చేసుకుందా..?

Trisha Krishnan marriage

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. మొదట తరుణ్ హీరోగా వచ్చిన నీ మనసు నాకు తెలుసు వంటి సినిమాతో హీరోయిన్ గా మొట్టమొదటిసారి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు అయ్యింది త్రిష. ఆ తరువాత వర్షం సినిమాతో మంచి పాపులారిటీ తెచ్చుకున్న త్రిష అనంతరం ఎన్నో చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించింది. ఈ మధ్యకాలంలో తక్కువ సినిమాలలో నటిస్తున్నప్పటికీ.. గతంలో మంచి నటిగా పేరు తెచ్చుకుంది.

అయితే గతంలో సినిమా అవకాశాలు లేక వివాహం చేసుకొని సెటిల్ అవ్వాలనుకున్న త్రిష కొన్ని కారణాల చేత ఆ వివాహాన్ని రద్దు చేసుకుంది. అయితే తాజాగా త్రిష రహస్యంగా పెళ్లి చేసుకుంది అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇది రియల్ లైఫ్ లో అనుకుంటే మాత్రం పొరపడినట్లే. ఆమె ఓ జ్యువెలరీ యాడ్ కి సంబంధించిన యాడ్ లో పెళ్లి చేసుకుంది.

ఈ వీడియో చూసిన ఆమె అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. కానీ అది యాడ్ కి సంబంధించింది అని తెలుసుకొని కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ప్రముఖ జ్యువెలరీ జిఆర్టి జ్యువెలర్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారింది త్రిష. ఈ జువెలరీ ప్రొడక్ట్స్ కి ప్రమోట్ చేసే కార్యక్రమంలో పెళ్లి వస్త్రాలతో, ఒంటినిండా నగలతో చూడచక్కగా కనిపించింది. ఈ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో త్రిష రహస్యంగా పెళ్లి చేసుకుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు