Balakrishna: బాలకృష్ణ డైరెక్షన్లో రావాల్సిన మూవీ ఇదే.. హీరోయిన్ మరణంతో మంట కలిసి పోయింది గా..!

Balakrishna: 50 ఏళ్ల సుదీర్ గా కెరీర్లో పౌరాణికం, జానపదం, యాక్షన్ అండ్ ఫాంటసీ ఇలా ఎన్నో జోనర్లలో నటించాడు బాలయ్య. సుదీర్ఘకాలం నుంచి బాలయ్య ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నారు. ఇక దర్శకుడిగా 2004లో బాలకృష్ణ ఓ సినిమా మొదలుపెట్టారు. అది కూడా మైథాలజికల్ కథాంశం తో భారీ బడ్జెట్ మల్టీ స్టార్లర్ గా తెరకెక్కించే ప్రయత్నం చేశారు.

ఇక బాలకృష్ణ డ్రీమ్ ప్రాజెక్టుగా మొదలైన ఈ మూవీ హీరోయిన్ మరణించడంతో అద్దాంతరంగా ఆగిపోయింది. ఆ మూవీ నే నర్తనశాల. తండ్రి సీనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన నర్తనశాల మూవీ స్ఫూర్తితో మైథాలజికల్ మూవీ చేయాలని బాలయ్య భావించారట. 2004లో ఆ సినిమా శ్రీకారం చుట్టుకుంది. తండ్రి సినిమా టైటిల్ తీసుకుని హీరోగా నటిస్తూనే దర్శకత్వం కూడా వ్యవహరించారు. ఇక ఈ చిత్రంలో అర్జునుడు, బృహన్నల తో పాటు మరో పాత్రను చేయాలని బాలకృష్ణ అనుకున్నారు.

This is the movie to be directed by Balakrishna
This is the movie to be directed by Balakrishna

ద్రౌపతి పాత్ర కోసం సౌందర్య ని ఎంచుకున్నారు. అలా కొంతమంది నటీనటులతో సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాడు బాలకృష్ణ. కొంత షూటింగ్ కూడా పూర్తయింది. కానీ హెలికాప్టర్ ప్రమాదంలో సౌందర్య కన్ను మూయడంతో నర్తనశాల మూవీకి బ్రేక్ పడింది. ద్రౌపది పాత్రలో మరో హీరోయిన్ను తీసుకుని ఈ సినిమా చేయాలని బాలయ్య భావించారు. సౌందర్యాకు తగ్గట్లుగా ఆ పాత్రకు సరిపోయే నటి దొరక్క పోవడంతో ఈ మూవీని బాలయ్య పూర్తిగా పక్కన పెట్టేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు