Narne Nithin: శ్రీ శ్రీ శ్రీ రాజావారుగా వచ్చేస్తున్న ఎన్టీఆర్ బావమరిది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Narne Nithin: మ్యాడ్ చిత్రంతో హీరోగా టాలీవుడ్ కి అడుగుపెట్టాడు నితిన్. కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద 20 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీ లో అశోక్ అనే పాత్రలో నితిన్ కనిపించాడు.

ఇక మ్యాడ్ మూవీ అనంతరం శ్రీశ్రీ శ్రీ రాజావారుతో త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు నితిన్. విలేజ్ యాక్షన్ లవ్ స్టోరీ గా రూపొందిన ఈ మూవీకి శతమానం భవతి ఫేమ్ సతీష్ దర్శకత్వం వహించారు. ఇక ఈ మూవీ పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.

NTR's brother-in-law who is coming as Sri Sri Sri Raja
NTR’s brother-in-law who is coming as Sri Sri Sri Raja

యూఏ సర్టిఫికెట్ కూడా లభించింది. త్వరలోనే ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నిజానికి మ్యాడ్ కంటే ముందే ఈ మూవీ రిలీజ్ కావాల్సింది. కానీ కొన్ని కారణాల చేత ఈ మూవీ వాయిదా పడింది. ఇక అతి త్వరలోనే ఈ మూవీ రిలీజ్ కాబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. కానీ డేట్ ని మాత్రం ఇంకా ఫిక్స్ చేయలేదు. త్వరలోనే ఈ మూవీ డేట్ కూడా ఫిక్స్ చేయనున్నట్లు తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు