Sonakshi Sinha : ప్రియుడితో పెళ్లి ఫిక్స్… వార్తలపై హీరామండి హీరోయిన్ సెటైర్లు

Sonakshi Sinha : ప్రస్తుతం బాలీవుడ్ మీడియాలో స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా కొత్త జీవితాన్ని ప్రారంభించబోతోంది అంటూ జోరుగా వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా సోనాక్షి పెళ్లి గురించే చర్చ జరుగుతోంది. పెళ్లి కారణంగా ఈ బ్యూటీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొందని, జూన్ 23న సోనాక్షి సిన్హా తన బాయ్ ఫ్రెండ్ తో ఏడు అడుగులు వేయబోతోందని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తనపై వస్తున్న పెళ్లి వార్తలపై సోనాక్షి సెటైరికల్ గా రియాక్ట్ అయ్యింది.

పెళ్లి వార్తలపై సెటైర్

సోనాక్షి, ఇక్బాల్ చాలా ఏళ్లుగా డేటింగ్‌లో ఉన్నారు అంటూ ఎప్పటి నుంచో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. చాలా చోట్ల ఇద్దరూ కలిసి కనిపించడంతో ఆ వార్తలకు బలం చేకూరింది. ఇక నటుడు, ప్రియుడు ఇక్బాల్ తో ఆమె పెళ్లి గురించి చర్చలు జోరుగా జరుగుతున్న నేపథ్యంలో సోనాక్షి సిన్హా పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో సోనాక్షి వివాహం, రోకా, మెహందీ మొదలైన వాటిపై స్పందిస్తూ కనిపించింది. క్యాప్షన్‌లో సోనాక్షి ‘ప్రపోజల్, రోకా, మెహందీ, సంగీత్ అన్నీ నిర్ణయించారు. దయచేసి నాకు కూడా చెప్పండి’ అంటూ అప్పట్లో తన పెళ్లి వార్తలపై సెటైర్ వేసింది.

Sonakshi Sinha – Zaheer Iqbal getting married on June 23: How love story  started, Salman Khan connection and more - IBTimes India

- Advertisement -

ప్రియుడితో పెళ్లి ఎక్కడంటే?

ప్రస్తుతం సోనాక్షి పెళ్లి వార్తలు మరోసారి వైరల్ అవుతున్నాయి. జూన్ 23న సోనాక్షి పెళ్లి జరగనుందని టాక్ నడుస్తోంది. సోనాక్షి తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను ముస్లిం పద్ధతిలో పెళ్లి చేసుకోనుందని, ఇప్పటికే పెళ్ళికి సంబంధించిన అన్నీ ఏర్పాట్లు జరిగాయని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ముంబైలోనే పెళ్లి వేదికను నిర్ణయించారని, ఈ వేడుకకు సోనాక్షి, ఇక్బాల్ కుటుంబీకులు, సన్నిహితులు హాజరవుతారని తెలుస్తోంది. అంతేకాదు రీసెంట్ గా హిట్టయిన హీరామండి వెబ్ సిరీస్ టీంను కూడా సోనాక్షి ఆహ్వానించిందట. ఇంకా పలువురు రాజకీయ, సినీ నటులు కూడా హాజరయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అయితే పెళ్లి వార్తలపై ఇద్దరూ అధికారిక ప్రకటన చేయలేదు.

పెళ్ళిపై సోనాక్షి రియాక్షన్

హీరామండి వెబ్ సిరీస్ లో సోనాక్షి సిన్హా ఓ ప్రధాన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’లో పాల్గొన్న సోనాక్షి తన పెళ్లి గురించి మాట్లాడింది.  కపిల్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు ? అని సోనాక్షీణి అడిగారు. ఆమె మాట్లాడుతూ.. ‘నేను పెళ్లి చేసుకోవడానికి ఎంత తొందరపడుతున్నానో తెలుసా’ అంటూ నవ్వేసింది.

వెడ్డింగ్ కార్డ్ ఎలా ఉంటుంది?

సోనాక్షి పెళ్లి ఆహ్వాన పత్రికను మ్యాగజైన్ కవర్ లాగా డిజైన్ చేసినట్లు సమాచారం. ఇదివరకెప్పుడూ లేని విధంగా డిఫరెంట్ గా డిజైన్ చేశారని తెలుస్తోంది. అందులో రూమర్స్ నిజమే అంటూ పెళ్లి విషయాన్ని వెల్లడించారని నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా 35 ఏళ్ళకు ఈ బ్యూటీ పెళ్ళికి రెడీ అవ్వడంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు