అప్పుడు పవర్ స్టార్ అలా , ఇప్పుడు మెగాస్టార్ ఇలా

మెగాస్టార్ చిరంజీవి ఇది కేవలం పేరు మాత్రమే కాదు ఇది ఒక ప్రభంజనం
తెలుగు సినిమాని 4 దశాబ్దాలుగా ఏలుతున్న రారాజు ఈయన
మెగాస్టార్ సినిమా రిలీజ్ అయితే చాలు అది ఒక పండగలా ఉంటుంది.
ఆయన కెరియర్ లో చూడని రికార్డ్స్ లేవు, ఆయన కొట్టని కలక్షన్స్ లేవు.
అసలు ఆయన గురించి ప్రస్తావించకుండా తెలుగు సినిమా గురించి మాట్లాడలేము. తెలుగు సినిమాకి ఆయనొక వరం. కామిక్ టైమింగ్ , వాయిస్ మాడ్యులేషన్ , డైలాగ్ డెలివరీ , డాన్స్ లలో ఇప్పటివరకు ఆయనను మించిన వారు లేరు. ఇదంతా సినిమాలు వరకు.


అలానే వ్యక్తిత్వంలో కూడా ఆయనను మించిన వారు, బ్లడ్ బ్యాంక్ దగ్గర నుంచి మొదలుపెడితే మొన్న కరోనా సమయంలో ఆయన చేసిన సహాయం వరకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలానే ఇప్పుడు తన సినిమా వలన నష్టబోయిన డిస్ట్బ్యూటర్స్ ను ఆదుకునేందుకు ముందడుగు వేస్తున్నారు మెగాస్టార్.
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ & మెగా పవర్ స్టార్ చేసిన ఆచార్య సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు అనే విషయం మనకు తెలిసిందే. ఎన్నో అంచనాలు మధ్య వచ్చిన ఈ సినిమా అభిమానులను,ప్రేక్షకులను తీవ్ర నిరాశపరిచింది. డిస్ట్బ్యూటర్స్ కు నష్టాలను తీసుకొచ్చింది. అలా ఆచార్య సినిమా వలన నష్టబోయిన కొంతమంది డిస్ట్బ్యూటర్స్ కు మెగాస్టార్ ఐదు కోట్లు ఇవ్వనున్నట్లు సమాచారం. అలానే ఇంకొంతమంది డిస్ట్బ్యూటర్స్ కు గాడ్ ఫాదర్ సినిమా రైట్స్ ను ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. అప్పట్లో జానీ సినిమా టైం లో పవన్ కళ్యాణ్ కూడా ఇలానే నష్టబోయిన డిస్ట్బ్యూటర్స్ కు పిలిచిమరీ డబ్బులు ఇచ్చారు. ఒక పని జరిగిపోయిన తరువాత మనకెందుకులే అనుకునే ఈ కాలంలో మనవలన ఎవరు నష్టపోకూడదు అనే ఉద్దేశ్యంతో తిరిగి కొంత డబ్బులివ్వడం అనేది నిజంగా మెచ్చుకోవాల్సిన విషయం.


అందుకే ఆయన రీల్ లైఫ్ మెగాస్టార్ మాత్రమే కాదు, రియల్ లైఫ్ మెగాస్టార్ కూడా.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు