కొన్ని సినిమాలకు పునాది నమ్మకంతో మొదలవుతుంది.
కేవలం దర్శకుడి యొక్క ఆలోచనను మాత్రమే నమ్మి దానిపై కోట్లు రూపాయలు ఖర్చుపెట్టడం అంటే మాములు విషయం కాదు.
ఆ సినిమా భారీ హిట్ అయితే శిఖరానికి ఎదుగుతాం,
పొరపాటున తేడా వస్తే.? పాతాళానికి పడిపోతాం.
ఒక సినిమా హిట్ అయిన తరువాత ప్రశంసలు రావడం,
ఆ సినిమాను ఆకాశానికి ఎత్తేయడం లాంటివి షరా మాములే.
కానీ పుష్ప సినిమా రిలీజైన తరువాత ఏ స్థాయిలో ఉండబోతుంది,
ఎంతమేరకు జనాలకు రీచ్ అవుతుంది,
ఎన్ని ప్రశంసలు తీసుకొస్తుందని ముందే గ్రహించాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.
“ఈ సినిమా ఒక మ్యాజిక్ లాగ కనెక్ట్ అయితే మాత్రం
సుకుమార్ గారికి మాములు పేరు రాదు ప్రతి డైరెక్టర్ వచ్చి పర్సనల్ గా కలిసి మీరు ఎలా కన్సీవ్ చేసారు సర్, ఏంటి సర్ ఇలా కూడా తియ్యొచ్చా సర్ సినిమా అని ఒక్కక్కొలు వచ్చి క్లాసెస్ చెప్పించుకోకపోతే నేను షర్ట్ ఇప్పేసి మైత్రి ఆఫీస్ లో తిరుగుతా ”
అని అప్పట్లో అల్లు అర్జున్ మాట్లాడిన ఈ మాటలు కొందరికి అతిగా అనిపించినా, ఇప్పుడు మాత్రం ఒక్కొక్కరికి జవాబులు అవుతున్నాయి.
పుష్ప సినిమాకి ఇప్పుడు వస్తున్న ప్రసంశలు, జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బన్నీ ఈ సినిమాను ఎంతలా నమ్మాడో మనకు అర్ధమవుతుంది.
బన్నీ ఈ సినిమా గురించి పలికిన ప్రతి మాట ఇప్పుడు అక్షరాలా నిజం అనిపిస్తుంది. రిలీజ్ రోజు మిశ్రమ స్పందనను తెచ్చుకున్న ఈ సినిమా, తరువాత సాలిడ్ గా ప్రేక్షకుల మైండ్ లోకి ఎక్కింది. కాసేపు అల్లు అర్జున్ ను మర్చిపోయి పుష్ప రాజ్ ను మాత్రమే గుర్తుపెట్టుకునే రేంజ్ పెరఫార్మన్స్ ఇచ్చాడు బన్నీ ఈ సినిమాలో. సుకుమార్ పుష్ప రాజ్ కేరక్టర్ ను బన్నీ కి చెప్పడం కాకుండా, ఇంజెక్ట్ చేసాడు అని ఫీల్ ను క్రియేట్ చేసాడు.
ఎప్పుడూ బాలీవుడ్ సినిమాలు చూసి ఆ స్థాయిలో మన సినిమాలు ఎందుకు లేవు అనే సందేహానికి ఈ మధ్యకాలంలో తెలుగు సినిమా ఒక సమాధానం అయింది. ఎవరి సినిమా కోసం మనం కళ్ళు కాయలు కాచేలా వేచి చూస్తామో అటువంటి ఒక దర్శకుడు తెలుగు సినిమా గురించే మాట్లాడితే.? మన దర్శకుడిపై ప్రశంసల వర్షం కురిపిస్తే.? అంతకు మించిన ఆనందం ఏముంటుంది. బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు “రాజ్ కుమార్ హిరానీ” పుష్ప సినిమా గురించి మాట్లాడినప్పుడు మనకు అలాంటి అనుభూతే కలుగుతుంది. కేవలం ప్రశంసలు మాత్రమే కాకుండా దర్శకుడిగా సుకుమార్ కి అవకాశాలు కూడా రావడం, పుష్ప-2 సినిమా వలన సుక్కు వాటిని పక్కన పెట్టడం ఇవన్నీ బన్నీ మాటలకి సంకేతాలే.
కేవలం సినిమా ప్రేమికులు మాత్రమే కాకుండా, రాజకీయ వేత్తలు , క్రీడ కారులు కూడా ఈ సినిమాలో డైలాగ్స్ చెప్తూ, మేనరిజం చూపించడం ఈ సినిమా సాధించిన అరుదైన ఘనత.