సినిమాల్లో హీరో అంటే, విలన్ ను చితక్కొట్టాలి. మంచి పనులు చేయాలి. హీరోయిన్ తో ఆడిపాడాలి. ఇది ఓల్డ్ ట్రెండ్. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. టాలీవుడ్ తో పాటు అన్ని ఇండస్ట్రీలో హీరో ఎలా ఉన్నా, కథ నచ్చితే సినిమాలు హిట్ అవుతున్నాయి. స్టోరీ బాగుంటే, హీరోలకు విలనిజాన్ని కూడా టచ్ చేసి, బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతున్నారు దర్శకులు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన “కేజీఎఫ్” సినిమాలో హీరో యష్ కు, విలనిజాన్ని జోడించి, పాత్రను పవర్ ఫుల్ గా మార్చాడు. ఈ పాత్ర అన్ని రంగాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.
నిజానికి “కేజీఎఫ్” కంటే ముందే పలు సినిమాల్లో హీరోలకు విలనిజాన్ని చేర్చి మంచి మార్కులు కొట్టేసిన వాళ్లు చాలా మంది ఉన్నారు. వీటిలో ప్రశాంత్ నీల్ “కేజీఎఫ్” ఒక్క అడుగు ముందు ఉందని చెప్పొచ్చు.
ఇదిలా ఉండగా, ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో “సలార్” తో పాటు “కేజీఎఫ్ – 3” యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. #NTR31 వర్కింగ్ టైటిల్ తో తారక్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఇప్పటికే విడుదల చేశారు. ఈ పోస్టర్ లో ఎన్టీఆర్ మాస్ లుక్ తో పవర్ ఫుల్ గా కనిపించాడు. అయితే ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
#NTR31 సినిమాలో తారక్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారట. కేజీఎఫ్ సినిమాలోని యష్ పాత్రను పోలి ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. ఎన్టీఆర్ ఇప్పటికే “జై లవకుశ” సినిమాలో జై అనే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నట విశ్వరూపం చూపించారు. ఈ సినిమా వచ్చి దాదాపు ఐదేళ్లు అవుతున్నా, నందమూరి అభిమానులు మర్చిపోలేకపోతున్నారు.
మళ్లీ ప్రశాంత్ నీల్ సినిమాలో నెగిటివ్ షేడ్స్ పాత్ర చేస్తే, ఫ్యాన్స్ కు ఇక పునకాలే అని చెప్పొచ్చు. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు.