Ante Sundaraniki : నత్త నడక ?

నేచురల్ స్టార్ నాని, మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ జంటగా వచ్చిన తాజా సినిమా “అంటే సుందరానికి”. “బ్రోచేవారెవరురా” “మెంటల్ మదిలో” లాంటి సినిమాలను తెరకెక్కించిన వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. “శ్యామ్ సింగరాయ్” హిట్ తర్వాత నాని చేసిన సినిమా కావడం, వివేక్ ఆత్రేయ డైరెక్షన్ పై ఉన్న నమ్మకంతో, ఈ సినిమాపై మొదటి నుండే అంచనాలు భారీగా ఉన్నాయి. సినిమా నుండి వచ్చిన టీజర్లు, ట్రైలర్స్ తో నాని పాత్రపై ఆసక్తి పెంచారు. ఇన్ని అంచనాల మధ్య “అంటే సుందరానికి” ఈ నెల 10న తెలుగుతో పాటు మలయాళం, తమిళ భాషల్లో విడుదల అయింది.

అంటే సుందరానికి సినిమాకు మంచి బజ్ క్రియేట్ కావడంతో, సినిమా విడుదల అయిన మొదటి షో నుండే పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో నిర్మాతలపై కలెక్షన్ల వర్షం కురవడం ఖాయమని అనుకున్నారు. అయితే, అందరినీ ఆశ్చర్యపరుస్తూ కలెక్షన్లు నత్త నడకన వస్తున్నాయి. మొదటి రోజు ఈ సినిమాకు కలెక్షన్లు ఇలా ఉన్నాయి.

నైజం – 1.54 కోట్లు
ఉత్తరాంద్ర – 0.42 కోట్లు
సీడెడ్ – 0.36 కోట్లు
గుంటూరు – 0.36 కోట్లు
ఈస్ట్, వెస్ట్ – 0.68 కోట్లు
కృష్ణా – 0.26 కోట్లు
నెల్లూరు – 0.20 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా – 0.25 కోట్లు
ఓవర్సీస్ – 1.70 కోట్లు

- Advertisement -

మొత్తం (ప్రపంచ వ్యాప్తంగా ) – 5.70 కోట్లు. (తెలుగు రాష్ట్రాల్లో – 3.82 కోట్లు)

నానికి ఉన్న మార్కెట్ కి ఇది తక్కువే అని చెప్పాలి. అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళ, మలయాళ భాషల్లో “మేజర్” “విక్రమ్” వేట ఇంకా కొనసాగుతుంది. ఈ రెండు సినిమాల ప్రభావంతోనే నాని సినిమాకు కలెక్షన్లు తక్కువ వచ్చాయని తెలుస్తుంది. అయితే శనివారం, ఆదివారం ఫ్యామిలీ ఆడియన్స్ నుండి స్పందన వచ్చి, కలెక్షన్లు పెరిగే అవకాశం కూడా ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు