SivaKarthikeyan: ఓటీటీలో డాన్

ఎన్నో సినిమాలు థియేటర్ లో విడుదలవుతాయి,
కొన్ని సినిమాలు బాగున్నాయని విని చూద్దాం అనుకునేలోపే థియేటర్ నుండి వెళ్లిపోతాయి. ప్రస్తుతం ఓటీటీలా పుణ్యమా అంటూ థియేటర్స్ లో మిస్ అయినా కొన్ని సినిమాలను మళ్ళీ చూడగల్గుతున్నాం.

రీసెంట్ టైమ్స్ లో శివ కార్తికేయన్ నటించిన డాన్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలియంది కాదు. కానీ ఈ సినిమాకి సంబంధించి ఏమైనా ఆటంకం ఉంది అంటే, అది ఈ సినిమా రిలీజ్ డేట్ అని చెప్పొచ్చు.
మే 13న రిలీజైన ఈ సినిమాకి ఒక్కరోజు ముందు మహేష్ బాబు
“సర్కారు వారి పాట” సినిమా రిలీజయింది.

అప్పటికే సర్కారు వారి పాట ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా మీద అంచనాలు కూడా పెరిగిపోయాయి.ఎంతోకాలంగా వెయిట్ చేస్తున్న స్టార్ హీరో సినిమా రిలీజైనప్పుడు డబ్బింగ్ సినిమాను ఎవరు పట్టించుకుంటారు. ఈ సినిమాకి అటువంటి సమస్యే ఎదురైంది. కానీ ఈ సినిమా చూసిన కొద్దిమంది మాత్రం తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు, ఇంకా సినిమాకి మెల్లమెల్లగా టాక్ నడిచి పుంజుకుంటుంది అనుకునే టైంకి “శేఖర్” సినిమా, ఆ తరువాత వారంలో “ఎఫ్ 3” సినిమా రిలీజయ్యాయి. డాన్ సినిమా అప్పటికే థియేటర్స్ లో కనుమరుగైంది.

- Advertisement -

ప్రస్తుతం డాన్ సినిమా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో వచ్చేసింది.
శివ కార్తికేయన్ హీరోగా సిబీ చక్రవర్తి దర్శకత్వం లో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ డాన్ ను లైకా ప్రొడక్షన్స్ మరియు శివ కార్తికేయన్ ప్రొడక్షన్స్ నిర్మించడం జరిగింది.ఈ చిత్రం లో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించగా, ఎస్. జే సూర్య, సముద్ర ఖని, సూరి లు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు