టాలీవుడ్ లో వివాదాస్పద దర్శకుడు అంటే, వెంటనే గుర్తు వచ్చే పేరు రామ్ గోపాల్ వర్మ. మీడియా ముందుకు వచ్చినా, సోషల్ మీడియాలో పోస్టు పెట్టినా, అదో పెద్ద వివాదమే అవుతుంది. గతంలో వర్మ చేసే సినిమాలతో వార్తల్లో ఉండేవాడు. కానీ, ప్రస్తుతం ఆర్జీవీ సోషల్ మీడియాలో చేసే వ్యాఖ్యల వల్ల వార్తల్లో ఉంటున్నారు. పబ్లిసిటీ కోసమే వర్మ కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేస్తారని ఓ వాదన కూడా ఉంది.
ఎప్పుడూ ఏదో ఒక పంచాయితీ పెట్టుకునే వర్మ, ఇటీవల నిర్మాత నట్టి కుమార్ తో జరిగిన వివాదం అందరికీ తెలిసిందే. “మా ఇష్టం” సినిమా సమయంలో వీరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. వర్మ తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదని కోర్టు మెట్లు ఎక్కాడు నట్టి కుమార్. ఆర్జీవీ ఏ మాత్రం తగ్గకుండా, నట్టి కుమార్ తన సంతకాన్ని ఫోర్జరీ చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వివాదం సమయంలో వర్మ – నట్టి కుమార్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం ఉండేది.
కానీ, తాజా గా అందరినీ ఆశ్చర్యపరుస్తూ, ఇద్దరు కలిసిపోయారు. తమ మధ్య ప్రస్తుతం ఎలాంటి గొడవలు లేవని వర్మ ట్విట్టర్ లో ఓ వీడియో పోస్టు చేసి, సినిమాల్లో, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు అనే క్యాప్షన్ ను కూడా జోడించారు. అలాగే రామ్ గోపాల్ వర్మ “గత కొద్ది వారాల క్రితం మా ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవులు అయ్యాయి. ఇప్పుడు వాటిని క్లీయర్ చేసుకున్నాం. మా మధ్య జరిగింది అంతా తూచ్. మళ్లీ కలిసి పని చేస్తాం. ఇప్పుడు మేము కలవడం వల్ల కొంత మంది బాధ పడవచ్చు. ” అంటూ చెప్పుకొచ్చారు.
అలాగే నట్టి కుమార్ “ తాము కొంత మధ్య వర్తుల చిచ్చుల వల్ల విడిపోయాం. నిజానికి మేము మంచి స్నేహితులమే. కేసులన్నీ రిటర్న్ చేసుకుంటాం. మా మధ్య చిచ్చు పెట్టిన వారిని వదలం” అంటూ చెప్పారు.
ఏది ఏమైనా, రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఏ మూడ్ లో ఉంటారో చెప్పడం కష్టమే అని ఈ వీడియో చూసిన నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
No permanent enemies in films and politics pic.twitter.com/2AloxjdHbr
— Ram Gopal Varma (@RGVzoomin) June 11, 2022