సుకుమార్, చేసిన ప్రతి సినిమాతో ఆడియన్స్ ను సర్పైజ్ చేయడం ఈయన పంథా, సుక్కు లాజిక్స్ , డీటైలింగ్ , టేకింగ్ , రైటింగ్ అన్ని ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని కలిగిస్తాయి. ఆర్య సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన ఈ లెక్కల మాస్టర్, ఆ సినిమాని ఒక అందమైన ప్రేమ కావ్యంగా మలిచాడు. అప్పటివరకు మనం చూసిన లవ్ స్టోరీస్ వేరు, ఆ లవ్ స్టోరీ వేరు. వన్ సైడ్ లవ్ అనే కాన్సప్ట్ కొత్తగా అనిపించింది ఆ టైం లో. ఇప్పటివరకు సుకుమార్ చేసిన సినిమా ఫెయిలై ఉండొచ్చు, కానీ దర్శకుడిగా సుకుమార్ ఏ రోజు ఫెయిల్ కాలేదు అనేది చాలామంది అభిప్రాయం.
కాలేజీ గొడవలు నేపథ్యంలో వచ్చిన “జగడం”,
బావ మరదల మధ్య ఉండే ఇగో ప్రాబ్లెమ్స్ చూపించిన “100% లవ్”,
తండ్రి కొడుకులు మధ్య ఉండే అనుబంధాలను చూపించిన “నాన్నకు ప్రేమతో”
ఇలా సుక్కు చేసిన సినిమా సినిమాకి విభిన్న కథాంశాలను ఎంచుకోవడం సుకుమార్ కి గౌరవాన్ని తీసుకొచ్చిపెట్టింది అని చెప్పొచ్చు.
రంగస్థలం సినిమాతో చరణ్ లోని మరో కోణాన్ని ఆవిష్కరింపజేసిన సుకుమార్, పుష్ప సినిమాతో తెలుగు సినిమా సత్తా ఏంటి అని భారతీయ సినిమాకి చూపించాడు. సినిమాలో డైలాగ్ మాదిరిగానే ఈ సినిమా ఎక్కడ తగ్గకుండా దూసుకెళ్లింది.
పుష్ప సినిమాకి ఇప్పటికే బాలీవుడ్ నుండి చాలా ప్రశంసలు దక్కాయి. రీసెంట్ గా బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజ్ కుమార్ హిరాని నుండి పుష్ప కి కాంప్లిమెంట్స్ దక్కాయి.
ఇటివలే ‘పుష్ప’ చూసిన రాజ్ కుమార్ హిరాని సుకుమార్ కి మెసేజ్ చేసారు.
“హాయ్ సుకుమార్ జీ, చాలా రోజులు క్రితం పుష్ప చూసినప్పుడే మీకు మెసేజ్ చెయ్యాలి, కానీ మీ నెంబర్ నా దగ్గర లేదు. నేను నిన్న మహావీర్ జైన్ ను కలిసాను, మీ గురించి మాట్లాడుకున్నాం, ఆయన దగ్గరనుండి మీ నెంబర్ తీసుకున్నాను”
అంటూ పుష్ప రైటింగ్ , సన్నివేశాల గురించి అలాగే మ్యూజిక్ గురించి అభినందనలు తెలిపాడు.
“ఈ సినిమా గురించి చాలా మందితో మాట్లాడాను. మీరు ఎప్పుడైనా ముంబై వస్తే ఏ టైం లో అయినా కాల్ చెయ్యండి కలుద్దాం”
అంటూ సుక్కు కి పర్సనల్ మెసేజ్ పెట్టారు రాజు హిరాని.
సుకుమార్ ఈ మెసేజ్ కు రిప్లై గా..
“కాస్త ఆలస్యంగా మీ మెసేజ్ రెస్పాండ్ అవుతున్నాను, ఎందుకంటే మీరు పంపించిన మెసేజ్ ను నా ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చెయ్యడంలో బిజీ గా ఉన్నాను. మీ నుండి టెక్స్ట్ రావడం ఎంతో సంతోషాన్ని కలిగించింది మీ రైటింగ్ , మేకింగ్ నాకు ఆదర్శం అంటూ రిప్లై ఇచ్చాడు.
రాజ్ కుమార్ హిరాని , సుక్కు మధ్య జరిగిన వాట్సాప్ చాట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.