Pawan Kalyan : ఆ విషయంలో క్లారిటీ లేదు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ అనే చిత్రం రూపందనున్నట్టు ఎప్పుడో అధికారిక ప్రకటన వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. నిజానికి ఈ ప్రాజెక్టు కి సంబంధించిన అధికారిక ప్రకటన 2020 లోనే వచ్చింది. కానీ ఇప్పటివరకు ఈ ప్రాజెక్టు ప్రారంభం కాలేదు. దీంతో ఈ మూవీ పై రకరకాల గాసిప్స్ వినిపించాయి. ఈ ప్రాజెక్ట్ పవన్ పక్కన పెట్టాడని, ఈ సినిమా చేయకుండా త్రివిక్రమ్ కాల్ షీట్లు తీసుకుంటున్నాడని, హరీష్ చెప్పిన స్క్రిప్ట్ పవన్ ను సంతృప్తిపరచలేదని ఇలా రకరకాల కామెంట్స్ వినిపించాయి.

అంటే సుందరానికీ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ ఈ పుకార్లకు పులిస్టాప్ పెట్టారు. తాను ప్రస్తుతం హరీష్ శంకర్ తో భవదీయుడు భగత్ సింగ్ చేస్తున్నట్టు స్పష్టం చేశాడు. అయితే ఒక్క విషయంలో మాత్రం పవన్ కానీ, హరీష్ కానీ క్లారిటీ ఇవ్వలేక పోయారు. ఈ సినిమా నుండి పూజా హెగ్డే తప్పుకుందని గత కొద్ది రోజుల నుండి వార్తలు వస్తున్నాయి. నిజానికి పూజా ను స్టార్ హీరోయిన్ చేసిన వాళ్లలో ముందు స్థానంలో ఉన్న వ్యక్తి హరీష్ శంకర్. దువ్వాడ జగన్నాథంతో మంచి పేరు తెచ్చుకున్న పూజా, హరీష్ కోసం తర్వాత గద్దల కొండ గణేష్ సినిమాలో నటించింది. మరి ఇప్పుడు హరీష్ శంకర్ మూవీ, దీంతో పాటు పవర్ స్టార్ సినిమాను బుట్టబొమ్మ చేసుకుంటుంది? అనే అభిప్రాయాలు సినీ లవర్స్ నుండి వస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు