సాధరణంగా సినిమా ఇండస్ట్రీలో నిర్మాతలు స్టార్ హీరోలతో సినిమాలు చేయలని, వారితో పెద్ద హిట్స్ కొట్టాలని అనుకుంటారు, అందుకు ప్రయత్నిస్తారు. ప్రస్తుతం టాలీవుడ్ లో మహేష్ బాబు, ప్రభాస్ అగ్ర స్థానంలో ఉండే హీరోలు. వీళ్ళతో ఓ మాదిరి సినిమా చేసినా నిర్మాతకి భారీ లాభాలు వస్తాయి. రాధే శ్యామ్ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైనా, సర్కారు వారి పాట యావరేజ్ అన్నట్టు ఆడినా, నిర్మాతలకు మాత్రం భారీ లాభాలను అందించాయి. వీళ్ళతో సినిమా తీయాలని, వీళ్ళ కాల్ షీట్లు కావాలని, దర్శకనిర్మాతలు ఎగబడుతూ ఉంటారు. కానీ ఓ స్టార్ ప్రొడ్యూసర్ మాత్రం మహేష్, ప్రభాస్ లు డేట్లు ఇచ్చినా, సినిమా తీయను అంటున్నాడు. అతను మరెవరో కాదు యం.ఎస్.రాజు.
యం.ఎస్ రాజు, మనసంతా నువ్వే, ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, వంటి బ్లాక్ బస్టర్ లను టాలీవుడ్ కు అందించారు. ఈ ప్రొడ్యూసర్ నుండి వచ్చే అంటే అప్పట్లో భారీ అంచనాలు ఉండేవి. పౌర్ణమి సినిమా తర్వాత ఆ నమ్మకం సినీ లవర్స్ ల్లో తగ్గిపోయింది. దీంతో డైరెక్టర్ అవతారం ఎత్తిన యం. ఎస్ రాజు, వాన, తూనీగ తూనీగ, డర్టీ హరి వంటి చిత్రాలను తెరకెక్కించారు. త్వరలో 7 డేస్ సిక్స్ నైట్స్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అయితే ప్రభాస్, మహేష్ వంటి స్టార్లు డేట్స్ ఇచ్చి సినిమా తీయమని ఆఫర్ ఇచ్చినా సినిమా తీయనని అంటున్నారు. స్క్రిప్ట్ డిమాండ్ చేయకపోతే స్టార్లతో సినిమా చేసినా ఉపయోగం ఉండదని, తన దృష్టిలో హీరోల కంటే, స్క్రిప్ట్ కే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పుకొచ్చారు.