Star Hero : యంగ్ హీరోయిన్లే కావాలి

సినిమాలకు హీరోలు ఎంత ముఖ్యమో, హీరోయిన్లు కూడా అంతే ముఖ్యం. అయితే, ప్రస్తుత కాలంలో హీరోయిన్లతో పని లేకుండానే స్టోరీలను సిద్దం చేస్తున్నారు దర్శకులు. ఇలాంటి ట్రెండ్ హాలీవుడ్ నుండి బాలీవుడ్ కు వరకు వచ్చేసింది. కానీ, తెలుగు హీరోలు మాత్రం హీరోయిన్లు లేకుండా సినిమాలు చేయడానికి ఇష్టపడటం లేదు. సినిమా చేయాలంటే, హీరోయిన్ కావాల్సిందే అంటున్నారు. ఈ మధ్య ఒక్కో సినిమాలో ఇద్దరు, ముగ్గురు హీరోయిన్లు ఉండేలా చూసుకుంటున్నారు. యంగ్ హీరోలు, వయసులో పెద్ద హీరోలు కూడా దీన్నే ఫాలో అవుతున్నారు.

ఒక హీరో మాత్రం ఐదు పదుల వయస్సు వచ్చినా, హీరోయిన్స్ లేకుండా సినిమా చేయలేనని చెబుతున్నాడు. అంతే కాకుండా, కేవలం యంగ్ హీరోయిన్స్ ను మాత్రమే తన సినిమాలకు ఎంపిక చేయాలని దర్శకనిర్మాతలపై ఫోర్స్ చేస్తున్నాడట. ఇండస్ట్రీలో పెద్ద హీరో కావడంతో చేసేదేమీ లేక యంగ్ హీరోయిన్లను ఎంపిక చేస్తున్నారు మేకర్స్. దీంతో, ఐదు పదుల వయస్సు ఉన్న హీరో తాజా గా చేస్తున్న ఓ సినిమాలో 21 ఏళ్ల భామ హీరోయిన్ గా చేయాల్సి వస్తుంది.

ఈ యంగ్ హీరోయిన్ తెలుగులో మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. రెండో సినిమాను ఈ హీరోతో చేస్తుంది.
కాగా, ఈ సినిమా షూటింగ్ ఇంకా జరుపుకుంటుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ తో హీరోయిన్, హీరోల మధ్య రొమాన్స్ సీన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇది చూసి కూతురు వయసు ఉన్న హీరోయిన్ తో రొమాన్స్ చేయడమేంటి అని నెటిజన్లు పెదవి విరుస్తున్నారు.

- Advertisement -

నిజానికి, టాలీవుడ్ లో 50 ఏళ్లపై వయసు ఉన్న హీరోలు కూడా హీరోయిన్స్ తో సినిమాలు చేస్తున్నారు. కానీ, మరీ 20 ఏళ్ల హీరోయిన్స్ ను ఎంచుకోవడం లేదు. అవసరమైతే, అలాంటి యంగ్ హీరోయిన్స్ కు చెల్లి పాత్ర లేదా, కూతురు పాత్ర ఇచ్చి, తమ సినిమాల్లో ఎంపిక చేస్తున్నారు. కానీ, ఈ హీరో మాత్రం ఏకంగా రొమాన్స్ చేస్తున్నాడు. ఈ హీరో వ్యవహారంపై సినీ ఇండస్ట్రీలో ఘాటుగా చర్చ నడుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు