Star Hero: స్నేహితుడు సలహాలు – హీరో నిర్ణయాలు

టాలీవుడ్ లో అతనో టాప్ హీరో. ఆ హీరో సినిమా రిలీజైతే ఒక రకమైన పండగ వాతావరణం ఉంటుంది. చేసినవే కొన్ని సినిమాలే అయినా వీపరీతమైన క్రేజ్ సంపాదించాడు. కానీ ప్రస్తుతం తప్పటడుగులు వేస్తున్నాడు. వరుస సినిమాలను అనౌన్స్ చేసాడు కానీ ఎవరికీ అందుబాటులో ఉంటాడో అర్ధం కానీ పరిస్థితి. దీనికి ప్రధమ కారణం తన నిర్ణయాలు తాను తీసుకోకుండా తన స్నేహితుడు మాటను వినడం.
స్వతహాగా ఆ స్నేహితుడు కూడా దర్శకుడు కావడంతో ఆ హీరో చేసే సినిమాల విషయంలో సలహాలు ఇవ్వడం మొదలుపెట్టాడు.

తన స్నేహితుడు సలహాలను తీసుకోవడం వలన హీరోకి ఎలా అనిపించినా, ఆ హీరోను నమ్ముకున్న నిర్మాత, దర్శకులు మాత్రం ఏళ్ళ తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి. ఎప్పుడో ప్రకటించిన సినిమాలు ఇప్పటికి ఒక కొలిక్కి రాకపోవడం, ఆలస్యంగా మొదలైన సినిమాలు మిగతావాటికంటే ముందస్తుగా రిలీజ్ అవ్వడం. ఆ హీరో సన్నిహితులకు పెద్దగా సహించడం లేదు.

ఏది ఏమైనా సలహాలను కొంతవరకు తీసుకోవడంలో తప్పు లేదు.
కానీ నిర్ణయాలు మాత్రం మనకు మనం తీసుకోవాలి. ఇప్పటికైనా ఆ హీరో మేల్కొని తన నిర్ణయాలు తాను తీసుకుని సినిమాలు చేస్తే దర్శకనిర్మాతలతో పాటు అభిమానులుకు కూడా ఆనందం కలిగినట్లే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు