థమన్ మళ్లీ అదేనా..?

థమన్.. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లలో ఒక్కరు. ఆయన మ్యూజిక్ అందించిన సాంగ్స్ అన్ని దాదాపు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో దేవీ శ్రీ ప్రసాద్, అనూప్ రూబెన్స్ కు వచ్చే అవకాశాలను కూడా థమనే కొట్టేస్తున్నాడు. టాలీవుడ్ కు థమన్ ఎన్ని హిట్స్ ఇచ్చినా ఆయన పై ఉన్న ఓ ట్యాగ్ మాత్రం తొలిగిపోవడం లేదు.

ఇప్పటికే అరవింద సమేత వీర రాఘవ మూవీలో పెనిమిటి సాంగ్, భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్, వరుడు కావలెను సినిమాలోని దిగు దిగు దిగు సాంగ్స్ కు మ్యూజిక్ కాపీ కొట్టాడని విమర్శలు వచ్చాయి. తాజా గా థమన్ మరోసారి కాపీ కొట్టి దొరికేశాడంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

సర్కారు వారి పాట మూవీ లో మా.. మా.. మహేషా సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో సూపర్ వ్యూస్ తో దూసుకెళ్తుంది. ఈ సాంగ్ ను మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కాపీ కొట్టాడంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి.

- Advertisement -

అల్లు అర్జున్ హీరోగా సరైనోడు సినిమాలోని బ్లాక్ బస్టర్ సాంగ్ లోని మ్యూజిక్ ను మా.. మా.. మహేషా పాటకు కాపీ కొట్టాడని నెటిజన్లు అంటున్నారు. నిజానికి బ్లాక్ బస్టర్ పాటకు మ్యూజిక్ అందించింది కూడా థమనే. తాను అందించిన మ్యూజిక్ ను తానే కాపీ కొడుతున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు