Sunny Leone : కానిస్టేబుల్ జాబ్ కి అప్లై చేసుకున్న సన్నీ… ఇదేందయ్యా ఇదీ!

బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీలియోన్ తరచుగా ఏదో ఒక వార్తతో అందరి దృష్టిని ఆకర్షిస్తూనే ఉంటుంది. తాజాగా ఆమె ప్రమేయం లేకుండానే సన్నీ పేరు వార్తల్లోకి ఎక్కింది. కానిస్టేబుల్ జాబ్ కి సన్నీ లియోన్ అప్లై చేసుకోవడమే అందుకు కారణం. మరి సన్నీ సినిమాలు వదిలేసి కానిస్టేబుల్ కావాలనుకుంటుందా? కానిస్టేబుల్ ఎగ్జామ్ కార్డులో ఈ బ్యూటీ పేరు ఎలా వచ్చింది? అన్న ఆసక్తికర కథనంలోకి వెళ్తే…

యూపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఉత్తర్ ప్రదేశ్ లో ఉన్న 60,244 కానిస్టేబుల్ ఖాళీలను భర్తీ చేయడం కోసం ఫిబ్రవరి 17న ఎగ్జామ్స్ నిర్వహించింది. ఈ పోలీస్ ఉద్యోగాల కోసం ఏకంగా 48 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. అయితే ఓ ప్రదేశంలో మాత్రం కానిస్టేబుల్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డులో సన్నీలియోన్ పేరుతో పాటు ఫోటోలు కూడా ఉండడం చర్చకు దారి తీసింది. కన్నోజ్ జిల్లాలో శ్రీమతి సొన్ శ్రీ స్మారక్ బాలిక మహా విద్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ ఎగ్జామ్స్ రాయాల్సిన ఒక అభ్యర్థి హాజరు కాలేదు. దానికి కారణం ఏంటని పరిశీలించగా, ఆమె రోల్ నెంబర్ పై సన్నీలియోన్ పేరు కనిపించింది.

యూపీ పోలీసులే స్వయంగా ఈ కార్డును జారీ చేయడం గమనార్హం. ఈ షాకింగ్ ఘటన బయటకు రావడంతో అసలు సన్నీలియోన్ పేరు, ఫోటోతో అడ్మిట్ కార్డు ఎలా తయారయింది అనే అంశాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై యూపీ పోలీస్ సైబర్ సెల్ దర్యాప్తు చేస్తోంది. కన్నౌజ్ ఏఎస్పి అమిత్ కుమార్ ఆనంద్ ఈ విషయం గురించి మాట్లాడుతూ కసంజ్ జిల్లా నుంచి ఆ హీరోయిన్ అప్లై చేసుకున్నట్టు ఉందని, కాబట్టి అక్కడి పోలీసులు అసలు ఆమె పేరుతో అడ్మిట్ కార్డు ఎలా జారీ అయ్యిందనే విషయాన్ని దర్యాప్తు చేస్తున్నారని వెల్లడించారు.

- Advertisement -

కెనడాలో సిక్కు కుటుంబంలో పుట్టిన సన్నీ అమెరికాలో పోర్న్ స్టార్ గా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత ఇండియాకు వచ్చేసి హీరోయిన్ గా మారి తన రాతను తానే మార్చేసుకుంది. ముందుగా బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొన్న ఈ అమ్మడు ఆ తర్వాత జిస్మ్ -2, జాక్ పాట్, షూట్ అవుట్ ఎట్ వచాలా, రాగిణి ఎంఎంఎస్ 2, వడ కర్రీ, హేట్ స్టోరీ 2 వంటి సినిమాల్లో నటించి హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత 2011లో నటుడు డేనియల్ వెబర్ ను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. వారి పేర్లు నిషా, ఆషేర్, నోహ్. ఇందులో నిషాను కొన్నేళ్ల కిందట సన్నీ దంపతులు దత్తత తీసుకున్నారు. 2018లో ఆషేర్, నోహ్ లకు సరోగసి ద్వారా తల్లిదండ్రులు అయ్యారు. ఇప్పటికీ పలు ఐటమ్ సాంగ్స్, సినిమాలు చేస్తూ అలరిస్తోంది సన్నీ.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు