Sukumar : సుకుమార్ “సెల్ఫిష్”

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ గురించి తెలియని వారు ఉండరు. ఈ లెక్కల మాస్టారు తెరకెక్కించిన సినిమాలకు ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఆర్య నుండి రంగస్థలం వరకు ఒక్కో సినిమా ఒక్కో అద్భుతమని చెప్పొచ్చు. ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో తెరకెక్కించిన పుష్ప ది రైజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాలోని పాటలు, డైలాగులు, డ్యాన్స్ సినీ ప్రపంచాన్నే ఊపేశాయి.

ఈ సినిమా చూసిన బాలీవుడ్ స్టార్స్ ఫీదా అయిపోయారు. సుక్కు దర్శకత్వ ప్రతిభకు, టేకింగ్ పై ప్రశంసలు కురిపంచారు. అలాగే, సుకుమార్ రైటింగ్స్ పేరుతో ఈ స్టార్ డైరెక్టర్ సినిమాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అలాగే పలు సినిమాలకు తన పెన్ తో ఎన్నో అద్భుతాలను అందించాడు సుక్కు. తాజా గా ఈ స్టార్ డైరెక్టర్ మరో సినిమాకు సాయం చేస్తున్నట్టు తెలుస్తుంది.

ప్రముఖ నిర్మాత దిల్ రాజు కుటుంబం నుండి రౌడీ బాయ్స్ సినిమాతో ఇండస్ట్రీ వచ్చిన యంగ్ హీరో ఆశిష్ ప్రస్తుతం “సెల్ఫిష్” అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు విశాల్ కాశీ దర్శకత్వం వహిస్తుండగా, స్టోరీ, డైలాగ్స్ అందించడానికి సుకుమార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ యంగ్ హీరో ఆశిష్ ప్రాజెక్ట్ లోకి సుకుమార్ ఎంట్రి ఇవ్వడంతో అంచనాలు కొంత వరకు అంచనాలు పెరిగిపోయాయి. కాగా, ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర్ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తుండగా, మిక్కి జే మేయర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు