Nanī : ఎన్టీఆర్ రికార్డుకు ఎసరు !

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘అంటే సుందరానికీ’. జూన్ 10న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్న, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించడం లేదనే చెప్పాలి. అందుకు కారణాలు అనేకం ఉన్నాయి. ఆ విషయాన్ని పక్కన పెడితే ఈ మూవీ ఓవర్సీస్ బయ్యర్స్ మాత్రం సేఫ్ జోన్ లో ఉన్నారు. అక్కడ ప్రేక్షకులు థియేటర్స్ రావడంతో డీసెంట్ ప్రాఫిట్స్ ను అందుకుంటున్నారు. ఈ రోజుతో అక్కడ 1 మిలియన్ డాలర్ల మార్క్ ను అంటే సుందరానికీ టచ్ చేసింది. ఓవర్సీస్ లో 1 మిలియన్ డాలర్ల మార్క్ అందుకోవడం నానికి ఇది 7వ సారి కావడం విశేషం. ‘ఈగ’ ‘భలే భలే మగాడివోయ్’ ‘నేను లోకల్’ ‘నిన్ను కోరి’ ‘ఎం.సి.ఎ’ ‘జెర్సీ’ సినిమాలతో పాటు ‘అంటే సుందరానికీ’ తో కలిపి నాని ఖాతాలో 1 మిలియన్ డాలర్ల మూవీస్ 7 ఉన్నాయి.

టాలీవుడ్ హీరోల్లో మహేష్ బాబుకు 1 మిలియన్ డాలర్ల మార్క్ అందుకున్న సినిమాలు 11 ఉన్నాయి. మహేష్ ఈ లీస్ట్ లో అగ్ర స్థానంలో ఉన్నాడు. అతని తర్వాత 7 సినిమాలతో తారక్ ఉన్నాడు. అంటే సుందరానికీ సినిమాతో తారక్ సరసన నాని చేరిపోయాడు. ఎన్టీఆర్ తన తర్వాతి సినిమా చేసే లోపు నాని ఇంకో 3 సినిమాలైనా చేసేస్తాడు. అందులో ఒక్క సినిమా 1 మిలియన్ కొట్టినా ఎన్టీఆర్ రికార్డ్ బ్రేక్ అయిపోయినట్టే..!

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు