Sai Pallavi : మెచ్యూరిటీ కి మెచ్చుకోవాల్సిందే !

విరాట పర్వం సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది సాయి పల్లవి. తన సినిమా థీమ్ గురించి చెబుతూ “ఇటీవల వచ్చిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రంలో ముస్లింలు హిందూ పండిట్ లను క్రూరంగా చంపడం చూపించారు. అలాగే ఈ మధ్య కాలంలో గో రక్షకులం అంటూ ఓ బండి పై ఆవులను తీసుకెళ్తున్న ముస్లింలను దారుణంగా కొట్టి జై శ్రీరామ్ అన్నారు. అక్కడ హింస, అనుకుంటే ఇక్కడ కూడా హింస జరిగినట్టే కదా ! మనం ఎవరిదీ తప్పు అనలేము. మంచిగా మనం ముందుకు వెళ్తే న్యాయం అనేది దోరుకుంది. లెఫ్టిస్ట్ , రైటిస్ట్ అయినా మంచి అనేది లేకపోతే న్యాయం దొరకదు కదా” అని అర్థం వచ్చేలా సాయి పల్లవి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

ఇక్కడ ఆమె మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు. అయినా సరే మమ్మల్ని కశ్మీర్ లో ఉన్న పాకిస్థాన్ లతో , టెర్రరిస్ట్ లతో పోల్చారు అంటూ పలు సంస్థలు సాయి పల్లవిపై సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. అయినా సరే ఇలాంటి విషయాలను అడ్డం పెట్టుకొని తన సినిమాకి పబ్లిసిటీ తెచ్చుకోవాలి అని కానీ, తను ఇంకా పాపులర్ అవ్వాలి అని కానీ అనుకోలేదు. ‘సమయం వచ్చినప్పుడు మాట్లాడతా, ఇప్పుడు నా సినిమా ప్రమోషన్ కోసం దానిని వాడుకోను. నా అభిమానులు ఈ ఇష్యూ నుండి నన్ను బయట పడేయాలి అని చూస్తున్నారు. దయచేసి మీరు ఇలాంటి విషయాల గురించి పట్టించుకుని మీ విలువైన సమయాన్ని వృథా చేసుకోకండి ‘ అంటూ ఈమె చెప్పుకొచ్చింది. నిజంగా ఈమె మెచ్యూరిటీ కి మెచ్చుకోవాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు