Agent : అఖిల్ ఎంట్రీ.. బాలయ్య ఎగ్జిట్ ?

అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి కూడా ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తుండడంతో ఈ మూవీ పై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఆగష్టు నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు అధికారిక ప్రకటన ఇచ్చింది చిత్ర బృందం. కానీ షూటింగ్ అనుకున్న టైమ్ కి పూర్తయ్యే విధంగా లేదట. అందుకోసం ఈ చిత్రాన్ని దసరాకు వాయిదా వేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే దసరాకు చిరంజీవి గాడ్ ఫాదర్, బాలయ్య 107 వ సినిమాలు విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాయని గత కొద్ది రోజుల నుండి ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

అయితే తాజా సమాచారం ప్రకారం బాలయ్య 107 యూనిట్ మనసు మార్చుకున్నట్టు తెలుస్తుంది. దసరా రేసు నుండి తప్పుకున్నట్టు సమాచారం. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలయ్య 107 వ సినిమా షూటింగ్ దసరా వరకు పూర్తి అయ్యే ఛాన్స్ లు తక్కువగా ఉన్నాయట. దాంతో అఖిల్ సినిమాని దసరా టైంలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. అఖిల్ గత చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కూడా దసరా కే రిలీజ్ అయ్యి మంచి హిట్ అందుకుంది. సెంటిమెంట్ పరంగా కూడా కలిసొస్తుందని దసరాకు అఖిల్ ఏజెంట్ సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు