Star Hero : ఏకంగా ఆర్టీవో ఆఫీసర్ బైక్ నే గుద్దేసిన స్టార్ హీరో… తరువాత ఏమైందంటే?

Star Hero : ఓ స్టార్ హీరో ఏకంగా ఆర్టీవో ఆఫీసర్ బైక్ నే ఢీ కొట్టాడట. సామాన్యుల విషయంలో ఇలా జరిగితే నెక్స్ట్ పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించడానికే భయమేస్తుంది. కానీ సదరు స్టార్ హీరో విషయంలో మాత్రం ఆ ఆర్టీవో ఆఫీసర్ ఊహించని విధంగా రియాక్ట్ అయ్యారట. మరి యాక్సిడెంట్ చేసిన ఆ హీరో ఎవరు? ఆ కథేంటి? అనే వివరాల్లోకి వెళ్తే..

సెకండ్ హ్యాండ్ బట్టలు వేసుకునే కొడుకు..

అక్షయ్ కుమార్ నార్త్ నుంచి సౌత్ దాకా ఉన్న మూవీ లవర్స్ అందరికీ సూపరిచితుడే. ఇటీవల ఆయన క్రికెటర్ శిఖర్ ధావన్ షో ధావన్ కరేంగేలో కనిపించాడు. అందులో ఆయన అనేక విషయాల గురించి మాట్లాడాడు. వాటిలో ఒకటి తన కొడుకు మూవీ ఎంట్రీ గురించి. తన వారసుడు సినిమా పరిశ్రమలో కెరీర్‌ను కొనసాగిస్తారా అనే ప్రశ్నకు లేదం సమాధానం ఇచ్చాడు. పైగా తన కొడుకు ఒక సామాన్యమైన పిల్లాడు అని, అతను ఇంత ఆస్తి ఉన్నా సెకండ్ హ్యాండ్ బట్టలే వేసుకుంటాడు అంటూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు అక్షయ్.

ఇంట్రెస్టింగ్ యాక్సిడెంట్ స్టోరీ..

ఈ షోలో భాగంగానే అక్షయ్ ఒక ఆసక్తికరమైన కథను కూడా చెప్పాడు. అతను ఒకసారి అనుకోకుండా ఆర్టీవో అధికారి బైక్‌ను ఢీ కొన్నాడట. బ్యాంకాక్‌లో జరిగిన ఈ సంఘటనను గుర్తు చేసుకుంటూ యాక్సిడెంట్ అయినప్పటికీ ఆ ఆధికారి ఎలా స్పందించారో చెప్పుకొచ్చారు ఈ బాలీవుడ్ కిలాడి. అక్షయ్ మాట్లాడుతూ “నేను వినయం ప్రాముఖ్యతను చెప్పాలి అనుకున్నప్పుడల్లా ఒక సంఘటనను గుర్తు చేసుకుంటాను. సవాళ్లను ఎదుర్కోవడంలో సహాయం చేస్తుంది కాబట్టి వినయంగా ఉండటం ముఖ్యం.

- Advertisement -

अक्षय कुमारने थेट RTO अधिकाऱ्याच्या गाडीला दिली होती धडक, म्हणाला - 'मी घाबरलो आणि भीतीपोटी...' - Marathi News | Akshay Kumar Share Incident From Bangkok He Accidentally Collided ...ఒకప్పుడు నా వాహనంలో రోడ్డుపై మలుపు తిరుగుతుండగా ప్రమాదవశాత్తూ ఆర్టీఓ అధికారి బైక్ ను ఢీ కొన్నాను. ఫలితంగా మేమిద్దరం పడిపోయాం. వెంటనే నేను భయపడిపోయి క్షమాపణలు చెప్పి ఆయనకు నమస్కరించాను. అయితే ఆశ్చర్యకరంగా ఆ అధికారి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా నా బైక్, హెల్మెట్ తీయడానికి నాకు సహాయం చేసాడు. తరువాత నెమ్మదిగా, జాగ్రత్తగా నడపమని నాకు సలహా ఇచ్చాడు” అంటూ ఒకప్పుడు తన జీవితంలో జరిగిన ఆసక్తికరమైన ఘటనను గుర్తు చేసుకున్నాడు.

బ్యాంకాక్ లో నచ్చింది ఇదే..

షో సందర్భంగా అక్షయ్ కుమార్ కెరీర్ లో తన తండ్రి తనకు ఎలా మద్దతు ఇచ్చాడో పంచుకున్నాడు. “నాకు చదువుపై ఆసక్తి లేదని మా నాన్న అర్థం చేసుకున్నారు. నేను చిన్నతనంలో బ్యాంకాక్‌కు వెళ్లడానికి సహాయం చేసారు. నాకు ఆ దేశం, అక్కడి మనుషులు బాగా నచ్చారు. మీరు విమానం దిగగానే అందరూ చేతులు జోడించి వినయంతో స్వాగతం పలుకుతారు. ఆ అనుభూతి పూర్తిగా భిన్నమైనది. చాలా బాగుంది, అందంగా అనిపించింది. ముఖ్యంగా ఈ సంజ్ఞ మన సంస్కృతి నుండి వచ్చిందని తెలుసుకోవడం బాగుంది.” అంటూ అక్షయ్ చెప్పుకొచ్చారు.

అక్షయ్ కుమార్ లాస్ట్ మూవీ…

అక్షయ్ కుమార్ చివరిగా టైగర్ ష్రాఫ్‌తో కలిసి బడే మియాన్ చోటే మియాన్‌లో కనిపించాడు. ఏప్రిల్ 10న ఈద్ సందర్భంగా విడుదలైనప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. అక్షయ్ కుమార్ ఇప్పుడు జాలీ LLB 3లో నటిస్తున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు