Aamir Khan : అమీర్ తో పెళ్ళి ఇష్టం లేకున్నా వాళ్ళ ఒత్తిడి వల్లే పెళ్లి చేసుకున్నా… కిరణ్ రావు షాకింగ్ కామెంట్స్

Aamir Khan : మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ గా అమీర్ ఖాన్ బాలీవుడ్ లో కోట్లాది మంది అభిమానుల మనసుల్లో చోటు సంపాదించుకున్నారు. కానీ ఆయన పర్సనల్ లైఫ్ మాత్రం కాస్త భిన్నంగానే ఉంటుంది. కొంతకాలం క్రితం అమీర్ తన భార్య కిరణ్ రావుకు విడాకులు ఇచ్చేసిన విషయం తెలిసిందే. తాజాగా కిరణ్ రావు తనకు అమీర్ తో అసలు పెళ్ళే ఇష్టం లేదని, కానీ ఇతరుల ఒత్తిడి కారణంగా పెళ్లి చేసుకున్నాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

లపాతా లేడీస్ తో హిట్..

లపాతా లేడీస్ సినిమాతో కిరణ్‌ రావు ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచింది. కిరణ్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడకపోయినా, ఓటీటీలో మాత్రం అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది. పైగా అలియా భట్ లాంటి పలువురు ప్రముఖులు ఈ మూవీపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించడం విశేషం. ఇక అసలు విషయంలోకి వెళ్తే తాజాగా ఓ ఇంటర్వ్యూలో అమీర్ ఖాన్ తో తన పెళ్లి గురించి కిరణ్ రావు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

పెళ్లైతే టైమ్ ఉండదు..

కిరణ్ తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడేందుకు అస్సలు వెనుకాడదు. విషయం ఏదైనా ముఖం మీదే కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతుంది తాజాగా మరోసారి తన మాజీ భర్త అమీర్‌ ఖాన్‌తో తన రిలేషన్‌షిప్ గురించి మాట్లాడింది. అమీర్‌ని ఎందుకు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుందో చెప్పుకొచ్చింది కిరణ్.

- Advertisement -

Aamir Khan On Divorce From Kiran Rao: "Our Relationship Has Changed But We  Are Still A Family"

అమీర్, కిరణ్ పెళ్లికి ముందే లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కిరణ్ రావు మాట్లాడుతూ పెళ్లి అనేది ఒక అందమైన విషయం అని ఒప్పుకుంది. అయితే ఈ పెళ్లయ్యాక ఆడవారికి తక్కువ సమయం లభిస్తుందనే వాస్తవాన్ని ప్రజలు పూర్తిగా పక్కన పెట్టేశారు. ఎందుకంటే వారు ఇంటిని, భర్త కుటుంబాన్ని చూసుకోవాలి. పెళ్ళయిన అమ్మాయి అందరితో కలిసి మెలసి ఉండాలని భావిస్తున్నారు అంటూ పెళ్లయ్యాక అమ్మాయిలకు బాధ్యతలు పెరుగుతాయని అన్నారు.

వాళ్ళ ఒత్తిడి వల్లే పెళ్లి..

ఇక పెళ్లికి ముందు 1 సంవత్సరం పాటు తాను, అమీర్ లివ్-ఇన్ రిలేషన్‌ షిప్‌లో ఉన్నామని చెప్పిన కిరణ్ రావు కుటుంబం, సమాజం కోసమే వివాహం చేసుకున్నట్టు వెల్లడించింది. కిరణ్ మాట్లాడుతూ “నిజం చెప్పాలంటే మా తల్లిదండ్రుల ఒత్తిడితో మేము వివాహం చేసుకున్నాము. పెళ్లిని ఎలా తీసుకుంటారు, మీరు దానిని ఎలా అర్థం చేసుకుంటారు అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది ఒక ముఖ్యమైన ప్రయోజనం కోసం జరుగుతుంది. ఆపై సామాజిక అంగీకారం చాలా ముఖ్యం. పిల్లల విషయాలో వివాహబంధం కీలకపాత్రను పోషిస్తుంది. కొత్త కుటుంబాన్ని ఇస్తుంది” అని ఆమె చెప్పింది.

కిరణ్ రావు ఆధునిక భావాలతో కొందరు ఏకీభవిస్తుంటే, మరికొందరు మాత్రం ఆమెను తప్పుబడుతున్నారు. కాగా అమీర్ తో విడాకులు తీసుకున్నప్పటికి కిరణ్ రావు ఆయన కలిసి ఇంకా సినిమాలు నిర్మిస్తోంది. ఇప్పటికీ ఇద్దరూ స్నేహంగానే ఉంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు