SSMB28: మ్యూజిక్ స్టార్ట్

మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదివరకే వీరి కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా చిత్రాలు మంచి ఆదరణ పొందాయి. అతడు, ఖలేజా సినిమాలు కమర్షియల్ హిట్ కాలేదు. అందుకే SSMB28 ను కమర్షియల్ హిట్ అందుకునే దిశగా కథను రాసుకున్నట్లు తెలుస్తోంది.

త్రివిక్రమ్ గత చిత్రాలు అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురంలో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి.
అందుకే ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రాబోయే చిత్రం పైన అంచనాలు ఇంకా పెరుగుతూ వస్తున్నాయి. త్రివిక్రమ్ తన సినిమాల విషయంలో హీరోలను, హీరోయిన్స్ , టెక్నీషయన్స్ చాలా తక్కువగా మారుస్తూ ఉంటారు చేసిన వాళ్ళతోనే ఎక్కువగా పని చేయడానికి ఇష్టపడతారు.

అరవింద సమేత నుండి త్వరలో సెట్స్ కి వెళ్లబోయే SSMB28 వరకు త్రివిక్రమ్ సినిమాలకు థమనే మ్యూజిక్ డైరెక్టర్. అంతకు ముందు దేవి శ్రీ ప్రసాద్, మణిశర్మ లాంటి సంగీత దర్శకులతో రిపీటెడ్ గా వర్క్ చేసాడు త్రివిక్రమ్. థమన్ సంగీత దర్శకుడిగా చేసిన 100వ సినిమా అరవింద సమేత, ఆ సినిమాకి మంచి మ్యూజిక్ అందించడంతో ఇప్పటికి థమన్ తో కొనసాగుతున్నాడు త్రివిక్రమ్. థమన్ కూడా అదే ఊపులో పనిచేస్తూ పొద్దుపొద్దునే త్రివిక్రమ్ మహేష్ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ పనుల్లో పడిపోయాడు. ఈ విషయాన్ని థమన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు