Sivaji Ganesan : అగ్ర హీరో కుటుంబంలో ఆస్తుల గొడవ

లెజెండరీ నటుడు శివాజీ గణేశన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ‘పరదేశి’ ‘పెంపుడు కొడుకు’ ‘మనోహర’ ‘బొమ్మల పెళ్లి’ ‘చాణక్య చంద్రగుప్త’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన ‘నరసింహ’ చిత్రంలో తండ్రి పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. 2001 లో శివాజీ గణేశన్ మరణించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, శివాజీ గణేశన్ కుటుంబంలో ప్రస్తుతం ఆస్తి గొడవలు మొదలయ్యాయి.

విషయంలోకి వెళ్తే, తండ్రి ఆస్తిని సమానంగా పంచలేదని నటుడు ప్రభు, నిర్మాత రామ్‌కుమార్‌ లపై తోబుట్టువులు శాంతి, రాజ్వీ హైకోర్టు కెక్కారు. శివాజీ గణేశన్ మరణం తర్వాత 271 కోట్ల ఆస్తి ని సరిగా పంచలేదని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వెయ్యి సవర్ల బంగారు నగలు, 500 కిలోల వెండి వస్తువులను సోదరులు ప్రభు, రామ్‌కుమార్ అపహరించారని అంటూ పిటిషన్లో పేర్కొన్నారు అని తెలుస్తుంది.

తమకు తెలీకుండానే ఆస్తులు విక్రయించారని ఆరోపించారు. అది చెల్లదని జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ పై సంతకం చేయించుకుని మోసం చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసులో ప్రభు, రామ్‌కుమార్‌ల కొడుకులు విక్రమ్ ప్రభు, దుష్యంత్‌లను కూడా ప్రతివాదులుగా చేర్చారు. దీంతో ఈ విషయం కోలీవుడ్ లో మరింత హాట్ టాపిక్ అయింది. మరి ఈ విషయం పై న్యాయస్థానం ఎలా స్పందిస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు