Ponniyin Selvan Teaser : విజువల్ ఫీస్ట్ అంతే

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం ఎన్నో అద్భుతమైన చిత్రాలను మనకు అందించారు. అయితే ఈ మధ్య కాలంలో హవా చాలా వరకు తగ్గింది. అలా అని నిర్మాతలకు, నటీనటులకు మణిరత్నం పై నమ్మకం తగ్గలేదు. అందుకు నిదర్శనం మణిరత్నం తెరకెక్కిస్తున్న ‘పొన్నియన్ సెల్వన్-1’. చియాన్ విక్రమ్‌, జ‌యం ర‌వి, కార్తీ, ఐశ్వర్య రాయ్‌, త్రిష వంటి స్టార్లు ఈ మూవీలో నటిస్తున్నారు. 500 కోట్ల అతి భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా ‘లైకా ప్రొడక్షన్స్’ అధినేత సుబాస్కరన్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను కూడా రిలీజ్ చేసింది చిత్ర బృందం.

ఈ టీజర్ ను గమనిస్తే విజువల్ ఎఫెక్ట్స్ కే పెద్దపీట వేసిన ఫీలింగ్ కలుగుతుంది. ఏ.ఆర్.రెహమాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, రవివర్మన్ సినిమాటోగ్రఫీ హైలెట్ గా నిలిచాయి అని చెప్పొచ్చు. టీజర్ మొత్తంలో ‘ఈ కల్లు, పాట, రక్తం, పోరాటం, అంతా దాన్ని మర్చిపోవడానికే.. ఆమెను మర్చిపోవడానికే, నన్ను నేనే మర్చిపోవడానికే’ అంటూ విక్రమ్ చెప్పిన డైలాగ్ తప్ప మరో డైలాగ్ లేదు. చోళ రాజ్యం కథాంశంతో ఈ చిత్రం రూపొందింది అని స్పష్టమవుతుంది.సెప్టెంబర్ 30న ఈ చిత్రం మొదటి భాగం తమిళ్ తో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కాబోతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు