కొడుకు కోసం శ్రీ‌కాంత్ క‌ష్టాలు..!

సెకండ్ ఇన్నింగ్స్ లో విల‌న్ పాత్ర‌లతో దూసుకెళ్తున్న శ్రీ‌కాంత్.. త‌న కొడుకు రోష‌న్ ను స్టార్ హీరోను చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఇండ‌స్ట్రీలో త‌న‌కున్న ప‌రిచ‌యాల‌తో స్టార్ డైరెక్ట‌ర్లు, నిర్మాత‌ల‌తో సినిమాలు చేయిస్తున్నాడు. ‘నిర్మాల కాన్వెంట్ తో రోష‌న్ మేక హీరోగా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయ్యాడు. ఈ సినిమా హిట్ చేయాల‌ని ఏకంగా అక్కినేని నాగార్జున‌నే రంగంలోకి దించాడు శ్రీ‌కాంత్.

నిమ్మ‌గ‌డ్డ ప్ర‌సాద్ తో పాటు నాగ్ కూడా ఈ సినిమాకు ప్రొడ్యూస్ చేశారు. కానీ ఈ సినిమా ఆశించిన ఫ‌లితాల‌ను ఇవ్వ‌లేక పోయింది. దీంతో రెండో సినిమా పెళ్లి సంద‌D ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర రావు ప‌ర్య‌వేక్ష‌ణ‌ చేశారు.

బాహుబ‌లి సినిమాల‌ను నిర్మించిన ఆర్కా మీడియా వ‌ర్క్స్ ప్రొడ్యూస్ చేసింది. టాలీవుడ్ దిగ్గ‌జ డైరెక్ట‌ర్, ప్రొడక్ష‌న్ కంపెనీ ఈ సినిమా కోసం ప‌ని చేసినా.. అంచ‌నాల‌ను అందుకోలేక పోయింది. దీంతో కెరీర్ లో స‌క్స‌స్ రావాల‌ని రోష‌న్.. న్యూమ‌రాల‌జీ ప్రకారం ఏకంగా పేరు మార్చుకున్నాడు.

- Advertisement -

దీని త‌ర్వాత మ‌రో స్టార్ డైరెక్ట‌ర్ నందిని రెడ్డి తో సినిమా చేయ‌డానికి రోష‌న్ సిద్ధం అవుతున్నాడు. రోష‌న్ కోసం నందిని రెడ్డి ఇప్ప‌టికే స్టోరీని కూడా సిద్ధం చేసిన‌ట్టు తెలుస్తుంది. ఈ సినిమాను జాతిర‌త్నాలు ఫేం స్వ‌ప్న సినిమాస్ నిర్మిస్తుంది. ఇది ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప్రాసెస్ లో ఉంది. ఈ సినిమాతో అయినా.. రోష‌న్ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు