స‌ర్కారు వారి పాట‌కు కొత్త త‌ల‌నొప్పులు..!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు స‌ర్కారు వారి పాట సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. గీత గోవిందం తో క‌మ‌ర్షియ‌ల్ హిట్ అందుకున్న డైరెక్ట‌ర్ ప‌ర‌శురామ్.. ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. మ‌హేష్ బాబు స‌ర‌స‌న కీర్తి సురేష్ న‌టిస్తుంది. అలాగే కీల‌క పాత్ర‌లో స‌ముద్ర ఖ‌ని, వెన్న‌ల కిషోర్, సుబ్బ‌రాజు క‌నిపించ‌బోతున్నారు. భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్క‌బోతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్, 14 రీల్స్ ప్ల‌స్, జి. మ‌హేష్ బాబు ఎంట‌ర్‌టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగ ప్ర‌స్తుతం స‌ర్కారు వారి పాట‌లో చివ‌రి పాట చిత్రిక‌ర‌ణ జ‌రుపుకుంటుంది. ఈ షూటింగ్ త‌ర్వాత‌.. ఎడిటింగ్ ప‌నులు పూర్తి చేసుకుని.. మే 12వ తేదీన రిలీజ్ కానుంది.

స‌ర్కారు వారి పాట క‌థ ప్ర‌కారం.. ఫ‌స్ట్ హాఫ్ లో మ‌హేష్ బాబు, కీర్తి సురేష్ మ‌ధ్య ల‌వ్ స్టోరీ ఉంటుంద‌ట‌. సెకండ్ హాప్ లో యాక్ష‌న్ సీన్స్ ఉండేలా.. డైరెక్ట‌ర్ ప‌రుశురామ్ తెర‌కెక్కించాడ‌ట. అయితే ఫ‌స్ట్ హాప్ స్టోరీ విష‌యంలో చిత్ర బృందానికి స‌మ‌స్యలు ఉన్నాయ‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. మ‌హేష్ – కీర్తిల మ‌ధ్య‌.. ల‌వ్ స్టోరీ కాస్త సాగ‌దీసే విధంగా ఉంద‌ని మూవీ యూనిట్ అసంతృప్తిలో ఉంద‌ట‌.

20 నిమిషాల్లో రావాల్సిన న‌డివి.. దాదాపు 40 నిమిషాల పాటు ల్యాగ్ అయింద‌ట‌. ఈ ఫ‌స్ట్ హాఫ్ విష‌యంలో డైరెక్ట‌ర్ కూడా డైల‌మోలో ఉన్నాడ‌ని తెలుస్తుంది. సాగ‌దీత సీన్స్ ను తొల‌గించి.. తిరిగి షూటింగ్ చేసేంత టైం కూడా లేద‌ట‌. దీంతో ఏం చేద్ధం అంటూ త‌ల ప‌ట్టుకుంటున్నార‌ట‌. తిరిగి షూటింగ్ చేస్తారా.. లేదా.. ఆ స‌న్నీవేశాల‌ను ఆస‌క్తిగా మార్చే విధంగా ఎడిటింగ్ చేస్తారా.. అనేది సినిమా రిలీజ్ తర్వాతే తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు