ఏక్ మినీ క‌థ త‌ర‌హాలోనే నాని, నాగ‌శౌర్య సినిమాలు

ప్రేక్ష‌కులు సినిమాల‌ నుంచి కొత్తద‌నం కోరుకుంటారు. విభిన్న క‌థాంశంతో వ‌చ్చిన సినిమాలకు ఇండ‌స్ట్రీలో మంచి మార్కులే ప‌డ్డాయి. కొన్ని సినిమాలు బ్లాక్ బాస్ట‌ర్ హిట్ ను కూడా అందుకున్నాయి. దీంతో టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కూడా కొత్త ప్ర‌యోగాలు చేయ‌డానికి ముందుకు వ‌స్తున్నారు. హీరోలు సైతం విభిన్న కథాంశంగ‌ల సినిమాల్లో న‌టించ‌డానికి వెన‌కాడ‌టం లేదు. ఇటీవ‌ల క‌రోనా మ‌హ‌మ్మారి సమ‌యంలో యంగ్ హీరో సంతోష్ శోభ‌న్ హీరోగా ఏక్ మినీ క‌థ వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఒక అబ్బాయికి ఉన్న లోపం.. అది త‌న ప్రేమ‌కు ఎలా అడ్డుప‌డుతుంది.. ఆ స‌మ‌స్య‌ను ఎలా జ‌యించాడు. అనే కథాంశంతో ఈ సినిమా వ‌చ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సంతోష్ శోభన్ కు హీరోగా మంచి గుర్తింపును తెచ్చింది.

ఈ క‌థ కాస్త డిఫ‌రెంట్ గా ఉండ‌టంతో తెలుగు ప్రేక్ష‌కులు ఆస‌క్తి చూపించారు. దీంతో ప‌లువురు డైరెక్ట‌ర్లు ఇలాంటి రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైనర్ మూవీస్ చేయ‌డానికి సిద్ధం అయ్యారు. ఏక్ మినీ క‌థ త‌ర‌హాలోనే ఇంకా బెట‌ర్ స్టోరీస్ సిద్ధం అవుతున్న‌ట్టు గ‌తంలోనే రూమ‌ర్స్ వ‌చ్చాయి. ఇదిలా ఉండ‌గా.. నేచుర‌ల్ స్టార్ నాని అంటే సుంద‌రానికి చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇది రొమాంటిక్, కామెడీ జోన‌ర్ లోనే తెర‌కెక్కుతుంది.

అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమాకు సంబంధించి క‌థ విష‌యంలో ఎలాంటి క్లూ రాలేదు. తాజాగా… అంటే సుంద‌రానికి నుంచి ఒక ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్క‌ర్లు కొడుతుంది. ఈ సినిమా ఏక్ మినీ కథ త‌ర‌హాలోనే ఉంటుంద‌ని ఫిల్మ్ న‌గ‌ర్ టాక్. హీరో నాని కూడా దీనిలో ఒక‌ లోపంతో బాధ‌ప‌డుతున్న‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. దీంతో పాటు యంగ్ హీరో నాగ‌శౌర్య.. కృష్ణ వ్రిందా విహారి క‌థాంశం కూడా ఈ జోన‌ర్ కు సంబంధించిందేన‌ట‌. ఏక్ మినీ క‌థ ను త‌ర‌హా లోనే డైరెక్టర్స్ ఈ సినిమాల‌ను తెర‌కెక్కిస్తున్నార‌ట‌. ఈ కొత్త ప్ర‌యోగం టాలీవుడ్ లో క్లిక్ అవుతుందో వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు