కెరీర్ అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ప్రారంభించి నేడు స్టార్ హీరో ఇమేజ్ ను తెచ్చుకున్నమాస్ మహారాజా రవితేజ టాలీవుడ్ అగ్ర హీరోల పక్కనచోటు సాధించే స్థాయికి ఎదిగాడు. గ్రౌండ్ లెవల్ నుంచి ఎవరి సపోర్ట్ లేకుండా.. రవితేజ ఇండస్ట్రీలో రాణించాడు. మాస్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు. దీంతో మాస్ మహారాజా అనే ట్యాగ్ కూడా వచ్చింది. కాగ ఎలాంటి పాత్రలో అయినా.. ఇట్టే ఒదిగిపోవడం మాస్ మహారాజా స్పెషాలిటి. రవితేజ వరుసగా ఎన్ని సినిమాలు చేసినా.. ప్రేక్షక ఆదరణ ఉంటుంది. ఆయన కెరీర్ లో ప్లాప్ మూవీస్ వచ్చినా.. స్టార్ డమ్ మాత్రం తగ్గలేదు. రవితేజ లాస్ట్ మూవీ ఖిలాడీ నెగెటివ్ టాక్ తెచ్చుకున్నా.. వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు.
ప్రస్తుతం ఈ మాస్ హీరో రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా, రావణాసురుడు, టైగర్ నాగేశ్వర రావు సినిమాల షూటింగ్ తో బిజీ గా ఉన్నాడు. గతంలో ఖిలాడీ మూవీని మేకర్స్ తెలుగు స్టేట్స్ తో పాటు నార్త్ లో కూడా రిలీజ్ చేశారు. అయితే ఇది నెగెటివ్ టాక్ తెచ్చుకుని నష్టాలను మూటకట్టుకుంది. ఇప్పుడు రవితేజ లైన్ అప్ లో ఉన్న నాలుగు సినిమాలను కూడా నార్త్ స్టేట్స్ ల్లో రిలీజ్ చేయాలని ప్రొడ్యూసర్లను మాస్ మహారాజా కోరుతున్నారట.
అయితే ఇప్పటికే హిందీ రాష్ట్రాల్లో నష్టాలు చూసిన అనుభవం ఉన్న రవితేజ .. మళ్లీ అవే తప్పులు చేస్తున్నాడని సినీ క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ హీరోకు తెలుగు రాష్ట్రాల్లో మంచి మార్కెట్ ఉన్నా.. నార్త్ లో లాభాలు తీసుకువచ్చేంత లేదని అంటున్నారు. తాను చేసే తప్పులు తెలుసుకుని.. తెలుగు మార్కెట్ పైనే ఫోకస్ చేస్తే మంచిదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.