Sridevi: పుస్తకంగా నటి జీవిత చరిత్ర

దివంగత స్టార్ హీరోయిన్, అతిలోకసుందరి, అందాల తారగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీదేవి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దక్షిణాదిని ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా చలామణి అయిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత బాలీవుడ్ లో కూడా తిరుగులేని మహారాణిల చక్రం తిప్పింది. ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి నటించి మంచి ఇమేజ్ ని సొంతం చేసుకుంది శ్రీదేవి.

అయితే శ్రీదేవి చనిపోయిన ఐదేళ్ల తర్వాత ఆమె పేరుతో పుస్తకం రిలీజ్ కాబోతోంది. ఆమె జీవితంలోని ఆసక్తికరమైన అంశాలను పొందుపరుస్తూ ప్రముఖ రచయిత, పరిశోధకుడు ధీరజ్ కుమార్ ” శ్రీదేవి.. ది లైఫ్ ఆఫ్ ఎ లెజెండ్” అనే పేరుతో ఈ పుస్తకాన్ని రచించారు. తాను రాసిన తొలి బయోగ్రఫీ ఇదేనని, త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేయబోతున్నామని రచయిత ధీరజ్ కుమార్ పేర్కొన్నారు.

అంతేకాదు శ్రీదేవి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు ఈ పుస్తకంలో ఉన్నాయని బోనీకపూర్ తెలిపారు. ఈ పుస్తకాన్ని ఈ ఏడాది చివరిలో వెస్ట్ ల్యాండ్ బుక్ సంస్థ విడుదల చేయనున్నట్లు చెప్పారు. భాషా బేధాలతో సంబంధం లేకుండా శ్రీదేవి అందరి అభిమానం సంపాదించుకుందని.. అలాంటి గొప్ప నటి జీవిత చరిత్రను రాసినందుకు రచయిత ధీరజ్ కు అభినందనలు తెలిపారు బోనీ కపూర్.

- Advertisement -

ఇదిలా ఉంటే.. శ్రీదేవి బయోగ్రఫీని సినిమాగా చేయాలని పలువురు దర్శక, నిర్మాతలు ఇప్పటికే ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అదేవిధంగా శ్రీదేవి బయోగ్రఫీలో నటించాలని పలువురు అగ్ర నటీమణులకు సైతం ఆశపడుతున్నారు. త్వరలోనే శ్రీదేవి జీవితం ఆధారంగా బయోపిక్ కూడా తెరకెక్కే అవకాశం కనిపిస్తోంది.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు