Balakrishna: బాలయ్య ” అఖండ 2 ” పై సాలిడ్ అప్డేట్..!

Balakrishna: అఖండ 2 సినిమా షూటింగ్ ఎప్పుడు అంటూ బాలయ్య ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పై తాజాగా ఓ అప్డేట్ వినిపిస్తుంది.‌ ఫస్ట్ డ్రాఫ్ట్ స్క్రిప్ట్ పూర్తి అయ్యింది అని బోయపాటి శ్రీను ప్రస్తుతం తన రైటింగ్ టీం తో బెటర్ మెన్స్ కోసం కసరత్తులు చేస్తున్నాడని తెలుస్తుంది.

ఇక పాటల రచయిత కళ్యాణ్ చక్రవర్తి కూడా ఈ సినిమా స్క్రిప్ట్ టీం లో వర్క్ చేయనున్నారట. ఇక రెండు నెలల తరువాత ఈ మూవీ రెగ్యులర్ షూట్ ను స్టార్ట్ చేయాలని బోయపాటి ప్లాన్ చేస్తున్నారట. అఖండ 2 కోసం అరకు, కొచ్చి లాంటి ప్రదేశాల్లో కొన్ని అద్భుతమైన లొకేషన్స్ ను మూవీ యూనిట్ పరిశీలించిందట.

Solid update on Balayya's "Akhanda 2"
Solid update on Balayya’s “Akhanda 2”

ఇక కథ ప్రకారం సినిమా పూర్తిగా శైవత్వం పై సాగుతుందని.. హిందుత్వానికి ప్రతిరూపం దక్షిణ భారతదేశం అనే కోణంలో సీన్స్ ఉండనున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా హిందూ దేవాలయాలకు సంబంధించిన లింక్స్ తో పాటు దక్షిణ భారతదేశం గొప్పతనాన్ని కూడా ఈ సినిమాలో బాగా ఎలివేట్ చేయనున్నారట. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్ర పోషించనున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు