Cinema : ప్రమోషన్స్ కోసం మరీ ఇంత దిగజారాలా..?

ఒకప్పుడు పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది అంటే.. ఆ విషయాన్ని ప్రేక్షకులందరికీ తెలియజేస్తే చాలు వాళ్ళు  థియేటర్ కు వచ్చి చూస్తారనే నమ్మకం మేకర్స్ లో ఉండేది. దానినే మైండ్లో పెట్టుకుని ప్రమోషన్ చేసుకునేవాళ్ళు. కొన్నాళ్ళకి సినిమా హిట్ అయ్యింది అని కూడా ప్రమోషన్  చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మరీ ఘోరమైన పరిస్థితి ఏర్పడింది అనే చెప్పాలి. పాండమిక్ వల్ల ఓటీటీ సంస్థలు రాజ్యమేలుతున్న ఈ టైములో ఓ కొత్త సినిమా అది కూడా పెద్ద సినిమాని రిలీజ్ చేయాలి అంటే.. మేకర్స్ ముందుగా ఆ సినిమా టికెట్ రేట్లు పెంచడం లేదని లేదా తగ్గిస్తున్నామని..  థియేటర్ కు వచ్చి మా సినిమాని చూడమని ప్రేక్షకులకి చెప్పాల్సి వస్తుంది. 
 
ఇక సినిమా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ సంపాదించుకుంటే, మా సినిమాని 50 రోజుల వరకు లేదా 8 వారాల వరకు ఓటిటిలో ప్రసారం చేయలేమని నిర్మాతలు చెప్పాల్సి వస్తుంది. ‘ఎఫ్3’ విషయంలో ఈ రెండు విషయాలు చూశాం. ఇక టికెట్ రేట్లు తగ్గించడం అనేది మేజర్, విక్రమ్ సినిమాలకు చూస్తున్నాం. రానున్న రోజుల్లో పెద్ద సినిమాల పరిస్థితి, థియేటర్ల పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉంటుందో అనే కామెంట్స్ కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి. 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు