Chiranjeevi : చిరుతో సినిమా.. వెంకీ కుడుముల క్లారిటీ..!

‘ఆర్.ఆర్.ఆర్’ నిర్మాత డీవీవీ దానయ్యకి చిరు ఓ సినిమా చేసి పెట్టాలి. ఈ విషయాన్ని.. ‘వినయ విధేయ రామ’ ప్రీ రిలీజ్ వేడుకలో చిరు చెప్పుకొచ్చారు. ఈ ప్రాజెక్టుకి త్రివిక్రమ్ దర్శకుడు అని కూడా అప్పుడే చెప్పేశారు చిరు. కానీ త్రివిక్రమ్ ఇప్పుడు తన సొంత బ్యానర్ లాంటి ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ కు తప్ప బయట బ్యానర్లలో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు.ఈ క్రమంలో చిరు- దానయ్య ల ప్రాజెక్టుకి అతను సున్నితంగా తిరస్కరించారు. ఇక త్రివిక్రమ్ స్థానంలో అతని  శిష్యుడు వెంకీ కుడుముల వచ్చి చేరాడు.
‘ఛలో’ ‘భీష్మ’… వంటి చిత్రాలతో హిట్లు కొట్టి ఫామ్లో ఉన్నాడు వెంకీ. అయితే ‘ఆచార్య’ ప్లాప్ అయ్యింది కాబట్టి వెంకీ కుడుముల ప్రాజెక్టుని చిరు పక్కన పెట్టినట్లు కథనాలు వినిపించాయి.  ఆ ఊహాగానాలకు తాజాగా ఫుల్ స్టాప్ పెట్టాడు వెంకీ. ‘విక్రమ్’ మూవీ ప్రమోషన్ల కోసం కమల్ హాసన్ ను వెంకీ ఇంటర్వ్యూ చేశాడు. ఈ ఇంటర్వ్యూ ఆరంభంలోనే తాను ఓ టాలీవుడ్ డైరెక్టర్ అని, రెండు సినిమాలు చేశాడని, నెక్స్ట్ సినిమా చిరంజీవి గారితో చేయబోతున్నట్టు క్లారిటీగా చెప్పాడు. ఆ విషయంలో తనని తాను అదృష్టవంతుడుగా భావిస్తున్నట్టు కూడా చెప్పుకొచ్చాడు. మొత్తానికి తన పై వస్తున్న గాసిప్స్ కు వెంకీ క్లారిటీ ఇచ్చేసినట్టే..!

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు