Naveen Chandra : “బాలయ్యని ముద్దు పెట్టుకోవాలనిపించింది”

బాలయ్య ఎప్పుడు ఎలా ఉంటారో ఎవ్వరికీ అర్థం కాదు. ఒక్కోసారి ఆయన అంత మంచి మనిషి లేడు అనుకుంటారు జనాలు. ఇంకోసారి ఆయనంత కోపిష్టి లేడు అనుకుంటారు. నిజానికి బాలయ్య చిన్న పిల్లాడి లాంటోడు. కోపం వచ్చినా.. ప్రేమ వచ్చినా దాచుకోలేడు. వెంటనే బయటపడిపోతుంటాడు. బయట బాలయ్య పై రకరకాల కామెంట్స్ వినిపిస్తుంటాయి. అయితే ఆయనతో పనిచేసిన వాళ్ళు మాత్రం ఆయన బంగారం లాంటి మనిషి అంటుంటారు. తాజాగా నటుడు నవీన్ చంద్ర కూడా ఇలాగే స్పందించారు. ‘విరాట పర్వం’ సినిమా ప్రమోషన్లో భాగంగా నవీన్ చంద్ర బాలయ్య గురించి చెప్పుకొచ్చాడు.

`బాల‌య్య లాంటి వ్యక్తిని నేను ఇప్పటి వరకు చూడలేదు. ఆయ‌న‌తో ప‌నిచేసిన రోజులు ఎప్పటికీ మర్చిపోలేను. ఆయ‌న నాకు తెగ ముద్దొచ్చేశారు. ఓసారి సెట్లో ఆయన్ని ముద్దు పెట్టుకోవాలన్నంత ప్రేమ కలిగింది.సెట్లో ఆయ‌న ఎన‌ర్జీ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. బ‌య‌ట ఆయ‌న గురించి చాలార‌కాలుగా మాట్లాడుకుంటారు.కానీ.. నేను చూసిన బాల‌య్య పూర్తిగా వేరు’ అంటూ నవీన్ చంద్ర చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈయన గోపీచంద్ మలినేని- బాలయ్య బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీని ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు నిర్మిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. శృతీ హాసన్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు