777 Charlie: మేజర్ బాటలోనే “777 చార్లీ”

ఒక మంచి సినిమా చెయ్యడం ఎంత ముఖ్యమో, ఆ మంచి సినిమాని ప్రేక్షకులకు చేర్చడం కూడా అంతే ముఖ్యం. ఒక సినిమాని చేస్తున్నపుడు ఆ సినిమా హీరో కానీ, ఆ సినిమాకి సంబంధించిన టెక్నీషియన్స్ కానీ ఆ సినిమా గురించి ప్రోమోట్ చెయ్యడం సాధారణమైన విషయమే. సినిమా అవుట్ పుట్ బాగా వస్తే ప్రొమోషన్స్ లో ఇంకా స్పీడ్ పెరుగుతుంది.

అడవి శేష్ హీరోగా చేసిన “మేజర్” సినిమా గురించి మనకు తెలిసిందే. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా మలిచిన ఈ సినిమాకి ప్రస్తుతం అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. వాస్తవానికి ఈ సినిమాపై ఈ టీం కి ఎప్పటినుండో బలమైన నమ్మకం ఉంది. అందుకే ఈ సినిమాని విస్తృతంగా ప్రచారం చేసింది ఈ చిత్ర బృందం.

అప్పట్లో ఏదైనా ఒక సినిమాకి వెళ్ళాలి అంటే కేవలం పాటలు వినే ఆ సినిమాపై నమ్మకం పెట్టుకుని వెళ్ళేవాళ్ళు, ఆ తరువాత కాలంలో ట్రైలర్ చూసి సినిమాకి వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు ఒక సినిమాకి సంబంధించి ఒక అప్డేట్ ఇవ్వాలన్నా కూడా అప్డేట్ టైం అనౌన్స్ చేస్తారు. మోషన్ పోస్టర్, టీజర్, ట్రైలర్ అని చాలా ఉన్నాయ్. కానీ “మేజర్” టీం మాత్రం వీటన్నింటిని మించి ప్రొమోషన్ చేసింది. విశాఖపట్నంలో ముందుగానే ఆడియన్స్ కి సినిమా చూపించి, ఆ తరువాత ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టారు ఈ మూవీ టీం.

- Advertisement -

“మేజర్” పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో రిలీజ్ కి 9 రోజులు ముందునుంచే ఈ సినిమాని ఒక్కో ప్లేస్ లో ఆడియన్స్ కి చూపిస్తూ వచ్చారు. ఇప్పుడే అదే బాటలో వెళ్తుంది “చార్లీ 777” టీం.
ఈ సినిమాను కూడా మేజర్ లాగే ముందే ప్రీమియర్స్ వేస్తున్నారు.
జూన్ 2న డిల్లీ, ఆ తర్వాత లక్నో , పూనె , త్రివేండ్రం , సోలాపూర్ , చెన్నై , కోల్ కత్తా, మదురై , హైదరబాద్ , వైజాగ్ ఇలా 21 సిటీస్ లో ప్రీమియర్స్ వేయబోతున్నారు.

“మేజర్” అందరికి తెలిసిన కథే కావడం వలన అలా చూపించిన పెద్దగా ఒరిగేదేమి ఉండదు.కానీ ఈ సినిమాపై కొంచెం బేధాభిప్రాయాలు వచ్చినా కలక్షన్స్ కి దెబ్బపడినట్లే.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు